ఒకటి రెండు సినిమాల్లో నటించిన వారు ఆ తర్వాత కనుమరుగవుతుంటారు. కానీ సోషల్ మీడియా కారణంగా మనం మర్చిపోయిన వాళ్లు కూడా నేనున్నానంటూ పలకరిస్తున్నారు. ఇన్ స్టాలో ఫొటోలను షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. రవితేజ హీరోగా నటించిన కిక్ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే.
ఈ మూవీలో ఇలియానా కి చెల్లి పాత్ర లో ఆషికా బతిజా నటించింది. కిక్ ఇచ్చిన ఆ అమ్మాయి మళ్లీ పెద్దగా కనిపించలేదు. హీరోయిన్ స్థాయి అందాల ఫీచర్స్ ఉన్న ఆషికా కొన్ని కారణాల వల్ల సినిమాలను వదిలేసింది. గత కొన్నాళ్లుగా చదువు పై దృష్టి పెట్టింది.లండన్ లో ఉన్నత చదువులు చదివిన ఆషికా మళ్లీ మోడలింగ్ పై ఆసక్తితో అటుగా అడుగులు వేసింది.
ALSO READ | జాన్వీకపూర్ ఉలాజ్ .. మూవీ నుంచి ట్రైలర్ విడుదల
మోడలింగ్ లో రాణిస్తూ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన అందాలను ఆరబోస్తూ ఫొటోలకు పోజులిస్తోంది. ఇన్ స్టా లో షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా మెల్ల మెల్లగా ఫాలోయింగ్ ను పెంచుకుంటున్న ఈ అమ్మడు టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తుందనే టాక్ వినిపిస్తోంది.