రవితేజ మాస్ జాతర ఎప్పుడంటే.?

రవితేజ మాస్ జాతర ఎప్పుడంటే.?

రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మాస్ జాతర’.  సితార ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ‘మనదే ఇదంతా’ ట్యాగ్‌‌లైన్‌‌తో రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి శుక్రవారం క్రేజీ అప్‌‌డేట్‌‌ను ప్రకటించారు మేకర్స్. ఈనెల 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ గ్లింప్స్‌‌ను రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు.

 ‘మాస్ ర్యాంపేజ్ గ్లింప్స్‌‌కు సిద్ధంకండి’ అంటూ విడుదల చేసిన  రవితేజ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. దావత్‌కు సిద్ధంగా ఉన్న రవితేజ.. ఎదురుగా ఆహార పదార్థాలు ఉండగా, బ్యాక్‌‌గ్రౌండ్‌‌లో కొందరు విలన్స్ ఉండటం, రవితేజ స్టైలిష్‌‌గా మీసం మెలేస్తున్న  స్టిల్ ఆకట్టుకుంది.   రవితేజ కెరీర్‌‌‌‌లో ఇది 75వ చిత్రం. ‘ధమాకా’ తర్వాత మరోసారి రవితేజకు జంటగా శ్రీలీల నటిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్‌‌‌‌లో సినిమా రిలీజ్‌‌కు ప్లాన్ చేస్తున్నారు.