Mr Bachchan OTT: ఓటీటీలోకి ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్..స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?: క్లారిటీ!

Mr Bachchan OTT: ఓటీటీలోకి ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్..స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?: క్లారిటీ!

మాస్ మహారాజా రవితేజ (Raviteja) హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ (Harish Shankar)లో ఆగస్ట్ 15న థియేటర్లలలో రిలీజైన మూవీ మిస్టర్ బచ్చన్(Mr.Bachchan). టీజ‌ర్‌, ట్రైల‌ర్స్‌లో ర‌వితేజ కామెడీ టైమింగ్‌, ప్ర‌మోష‌న్స్‌లో భాగ్య‌శ్రీ బోర్సే గ్లామ‌ర్ కార‌ణంగా మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌పై ముందు నుంచి మంచి బ‌జ్ ఉండడం వల్ల..కలెక్షన్స్ బాగానే వస్తాయనుకున్న..ఫ‌స్ట్ డేనే బాక్సాఫీస్ వ‌ద్ద చ‌తికిలాప‌డింది. ప్రస్తుతం ఈ మూవీ థియేట్రికల్ రన్ ముగిసిందనే తెలుస్తోంది. దీంతో రిలీజైన నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోందని సమాచారం. 

మిస్టర్ బచ్చన్ మూవీ వచ్చేనెల సెప్టెంబ‌ర్ 12న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రానున్నట్లు సమాచారం. ఒకే రోజు తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో అందుబాటులోకి రానుంది. ఓటీటీ రిలీజ్ డేట్ పై సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో మేకర్స్ నుంచి అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. 

మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీకి రూ.31 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రూ.32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఫ‌స్ట్ వీక్ కంప్లీట్ అయ్యేలోపు రూ.8కోట్ల వ‌ర‌కు మాత్ర‌మే క‌లెక్ష‌న్స్ సాధించింది. దీంతో ఈ చిత్ర నిర్మాత‌ల‌కు రూ.25 కోట్ల వ‌ర‌కు న‌ష్టాల‌ను మిగిల్చిందిని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.మరి ఓటీటీ ఆడియన్స్ ను ఏ విధంగా ఆకట్టుకుంటోందో చూడాలి.