టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో మాస్ మహారజా రవితేజ నూతన డైరెక్టర్ భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజకి జోడీగా యంగ్ బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. తెలుగు ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.
అయితే దీపావళి పండుగ సదర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా టైటిల్ ని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా "మాస్ జాతర : మనదే ఇదంతా" అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేగాకుండా మాస్ జాతర పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.
Also Read :- జై హనుమాన్ నుంచి బిగ్ అప్డేట్
ఈ పోస్టర్ లో రవితేజ గంట కొడుతూ మంటల్లో తగలబడుతున్న జాయింట్ వీల్ ముందు నుంచి నడుస్తూ కనిపించాడు. అలాగే చిత్ర యూనిట్ ఆడియన్స్ కి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మాస్ జాతర సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మే 9వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.