వెంకీ రీ రిలీజ్ డెట్ ఫిక్స్... కాకపోతే అప్పటివరకు ఆగాల్సిందే

మాస్ మాహారాజ్ రవితేజ, స్నేహ హీరోహీరోయిన్లుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో విడుదలైన తెరకెక్కిన  చిత్రం వెంకీ. 2004 మార్చి 26న రిలీజై సూపర్ హిట్టైన ఈ చిత్రాన్ని అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించారు.  ఇప్పుడు ఈ సినిమాను రీరిలీజ్  చేస్తున్నారు. అపిషీయల్ గా సినిమా రీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. 

2023 డిసెంబర్ 30న శ్రీ మాతా క్రియేషన్స్  ఈ సినిమాను రీ రిలీజ్ చేయనుంది. ఈ మేరకు పోస్టర్ ను కూడా రిలీజ్  చేసింది.  దీంతో రవితేజ ఫ్యాన్స్ తో పాటుగా వెంకీ మూవీ లవర్స్ అందరూ ఈ సినిమాను మరోసారి థియేటర్లో చూసేందుకు వెయిట్ చేస్తున్నారు.   

కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అందుకుంది.  ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్ ఈ  సినిమాకు బాగా ప్లస్ అయిపోయింది.  ఈ ఒక్క ఎపిసోడ్ కు సపరెట్ ఫ్యాన్స్ ఉన్నారు.  సినిమాంతా ఒక్కెత్తు అయితే. ఈ ఎపిసోడ్ మరో ఎత్తని చెప్పాలి. ఈ ట్రైన్ ఎపిసోడ్ తోనే సినిమా మలుపు తిరిగి అసలు కథ మొదలవుతుంది.  సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన మీమ్సే ఎక్కువగా ఉంటాయి.  

ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, కోన వెంకట్, గోపీమోహన్  డైలాగ్స్, సాహితి లిరిక్స్  సినిమాకు అడిషినల్ గా ప్లస్ అయ్యాయి. ఈ సినిమాను శ్రీను వైట్ల డిల్ చేసిన విధానం స్టార్ హీరోలకు కూడా నచ్చేసింది. చిరంజీవి లాంటి స్టార్ తనతో సినిమా చేయమని ఓపెన్ ఆఫర్ చేశారు.  మరి  రీరిలీజ్ లో వెంకీ మూవీ ఎలాంటి ఇంపాక్ట్ తెస్తుందో చూడాలి.