
న్యూఢిల్లీ : టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పోర్ట్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు. గ్లోబల్ చెస్ లీగ్‌లో అమెరికన్ గాంబిట్స్ అనే టీమ్‌ను కొనుగోలు చేశాడు. ఈ టీమ్‌కు అశ్విన్ సహ యజమానిగా ఉండనున్నాడు. టెక్ మహీంద్ర, ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున గ్లోబల్ చెస్ లీగ్‌లో ఆరు జట్లు పోటీపడనున్నాయి. లండన్‌లో అక్టోబర్ 3 నుంచి 12 వరకు ఈ ఈవెంట్ జరగనుంది. చింగారి గల్ఫ్ టైటాన్స్ స్థానంలో అమెరికన్ గాంబిట్స్ జట్టు బరిలోకి దిగనుంది.