IND vs ENG: ఆ తప్పు ఏదో ఒకరోజు టీమిండియాకు శాపంలా మారుతుంది: అశ్విన్

IND vs ENG: ఆ తప్పు ఏదో ఒకరోజు టీమిండియాకు శాపంలా మారుతుంది: అశ్విన్

నాలుగో టీ20లో టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి వికెట్లు తీయడం పెద్ద దుమారమే రేపింది. శివమ్ దూబేకి కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ రూల్ కరెక్ట్ ఉన్నప్పటికీ ఆల్ రౌండర్ శివమ్ దూబేకి స్థానంలో రాణా రావడం ఆశ్చర్యానికి గురి చేసింది. రాణా మ్యాచ్ ఫలితం మార్చడంతో ఇంగ్లాండ్ సిరీస్ కోల్పోయింది. రాణా ఎంట్రీపై ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ నుంచి ఆ దేశ మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఈ విషయంపై టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ ఇంగ్లాండ్ కు మద్దతుగా నిలిచాడు. 

అశ్విన్ తన యూ ట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ.." క్రికెట్ లో ఇది పూర్తిగా తప్పు అని అర్ధమవుతుంది. అంపైర్, మ్యాచ్ రిఫరీ దూబే స్థానంలో రమణ్ దీప్ సింగ్ ను అనుమతించాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ కింద హర్షిత్ రాణా బరిలోకి దిగాడు. ఈ రోజు ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో బాధపడవచ్చు. కానీ ఏదో ఒక రోజు భారత్ కు ఇలాంటి పరిస్థితే ఎదురైనప్పడు బాధపడాల్సి వస్తుంది. గతంలో కాన్‌బెర్రాలో రవీంద్ర జడేజా కంకషన్‌కు గురయ్యాడు. అతని స్థానంలో యుజ్వేంద్ర చాహల్ ప్రత్యామ్నాయంగా వచ్చాడు. ఇద్దరు స్పిన్నర్లే కావడం నాకు న్యాయం అనిపించింది". అని ఈ మాజీ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు. 

ALSO READ : Under 19 Womens T20 World Cup Final: ఫైనల్లో టాస్ ఓడిపోయిన భారత్.. సౌతాఫ్రికా బ్యాటింగ్

అసలేం జరిగినందంటే..?

భారత బ్యాటింగ్ ముగిశాక కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా యువ పేసర్ హర్షిత్ రాణా జట్టులోకి వచ్చాడు. శివమ్ దూబేకి కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి వచ్చిన అతన్ని..  కెప్టెన్ సూర్య బాగా ఉపయోగించుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో తన కోటా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన రాణా.. 3 కీలక వికెట్లు పడగొట్టి.. జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. లివింగ్‌స్టోన్(9), జాకబ్ బెథెల్(6), జామీ ఓవర్టన్(19).. ముగ్గరిని పెవిలియన్ చేర్చాడు.