IND vs BAN 2024: స్పిన్‌తో కాదు.. బ్యాట్‌తో కొట్టాడు: సెంచరీతో బంగ్లాకు చుక్కలు చూపించిన అశ్విన్

IND vs BAN 2024: స్పిన్‌తో కాదు.. బ్యాట్‌తో కొట్టాడు: సెంచరీతో బంగ్లాకు చుక్కలు చూపించిన అశ్విన్

పాకిస్థాన్ జట్టును వారి సొంతగడ్డపై ఓడించి సిరీస్ గెలిచి మంచి ఊపు మీద కనిపించిన బంగ్లాదేశ్.. అదే జోరును భారత్ పై కొనసాగించింది. చెన్నై లోని  చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజు ఆటలో 144 పరుగులకే 6 వికెట్లు తీసి భారత్ ను కష్టాల్లో నెట్టింది. అయితే ఇక్కడ నుంచే అసలు గేమ్ స్టార్ట్ అవుతుందని బంగ్లా కూడా ఊహించి ఉండదు. ముఖ్యంగా భారత లోయర్ ఆర్డర్ ఆల్ రౌండర్ రవి చంద్రన్ అశ్విన్ విశ్వరూపమే చూపించాడు. టాపార్డర్, మిడిల్ ఆర్డర్ విఫమలమైన చోట మెరుపు సెంచరీతో అదరగొట్టాడు. 

108 బంతుల్లో 10 ఫోర్లు 2 సిక్సర్లతో ఏకంగా శతకం బాదేశాడు. అశ్విన్ టెస్ట్ కెరీర్ లో ఇది ఆరో సెంచరీ కావడం విశేషం. అతని టెస్ట్ కెరీర్ లో 13 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. తనకు కలిసొచ్చిన (చెపాక్) సొంతగడ్డపై అదే పనిగా చెలరేగాడు. బంగ్లా బౌలర్లను ఉతికారేస్తూ అలవోకగా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇటీవలే తమిళ నాడు ప్రీమియర్ లీగ్ లో ఓపెనర్ అవతారమెత్తి అదరగొట్టిన అశ్విన్.. టీమిండియా తరపున టెస్టుల్లోనూ తన బ్యాటింగ్ సత్తా చూపించాడు. అశ్విన్ కు మరో ఆల్ రౌండర్ జడేజా సహకరించడంతో భారత్ తొలి రోజు పటిష్ట స్థితిలో నిలిచింది.

Also Read :- మూడు ఇన్నింగ్స్‌ల్లో రెండు డకౌట్లు.. దులీప్ ట్రోఫీలోనూ అయ్యర్ విఫలం

తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 80 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. వీరిద్దరూ ఏడో వికెట్ కు అజేయంగా 195 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం తొలి రోజు మ్యాచ్ లో హైలెట్ గా మారింది. మరో ఎండ్ లో జడేజా (86) సైతం సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. స్టార్ బ్యాటర్లు విఫలమైనా.. ఓపెనర్ జైశ్వాల్ 56 పరుగులు చేసి బాధ్యతాయుత బ్యాటింగ్ చేశాడు. 39 పరుగులు చేసి పంత్ అతనికి చక్కని సహకారం అందించాడు.