టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ వయసుతో సంబంధం లేకుండా తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. టెస్ట్ కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు టాప్ ఫామ్ తో దూసుకెళ్తున్నాడు. 38 ఏళ్ళ వయసులోనూ దిగ్గజాల రికార్డులను బద్దలు కొడుతున్నాడు. తాజాగా బంగ్లాదేశ్ పై ముగిసిన రెండు టెస్టుల సిరీస్ లో ఆల్ రౌండ్ షో తో అదరగొట్టి శ్రీలంక దిగ్గజ బౌలర్.. వరల్డ్ ఆల్ టైం బెస్ట్ స్పిన్నర్ మురళీ ధరన్ రికార్డ్ సమం చేశాడు.
బంగ్లాదేశ్ తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ లో అశ్విన్ బ్యాటింగ్, బౌలింగ్ లో మెరిశాడు. ఈ సిరీస్ లో 114 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. దీంతో టెస్ట్ క్రికెట్ లో 11 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకొని మురళీ ధరన్ రికార్డ్ సమం చేశాడు. లంక స్పిన్నర్ నిన్నటివరకు ఈ లిస్ట్ లో టాప్ లో కొనసాగుతుండగా.. అశ్విన్ ఈ రికార్డ్ ను సమం చేశాడు. 11 ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ లు గెలుచుకోవడానికి మురళీకి 61 సిరీస్ లు అవసరమైతే.. అశ్విన్ కు మాత్రం 42 సిరీస్ లో ఈ ఘనత సాధించాడు. సౌతాఫ్రికా దిగ్గజ ఆల్ రౌండర్ జాక్వస్ కల్లిస్ 9 ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ లతో మూడో స్థానంలో ఉన్నాడు.
ALSO READ | IND vs BAN 2nd Test: ఛాలెంజ్‌కు రెడీ.. 100 పరుగులకు ఆలౌటైనా పర్లేదు: రోహిత్ శర్మ
చెన్నై టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో బ్యాట్ తో మెరిసి సెంచరీ.. రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ లో చెలరేగి 6 వికెట్లు పడగొట్టాడు. తొలి టెస్ట్ నాలుగో రోజు ఆటలో భాగంగా షకీబ్ ఉల్ హసన్ వికెట్ తీసి 5 వికెట్లు పడగొట్టిన అశ్విన్ టెస్టు క్రికెట్ లో 37 సార్లు ఈ ఫీట్ సాధించి ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ను సమం చేశాడు. షేన్ వార్న్ 145 మ్యాచ్ ల్లో ఈ ఘనత అందుకుంటే.. అశ్విన్ మాత్రం 101 టెస్టులు అవసరమయ్యాయి.
ఈ మ్యాచ్ లోనే షకీబ్ వికెట్ తీసి అశ్విన్ 520 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. దీంతో వెస్టిండీస్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ కోట్నీ వాల్ష్ 519 వికెట్లను దాటేశాడు. ప్రస్తుతం అశ్విన్ టెస్టుల్లో 102 మ్యాచ్ ల్లో 527 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు పడగొట్టిన 8వ బౌలర్ గా నిలిచాడు. ఇదే మ్యాచ్ లో సెంచరీతో పాటు 5 వికెట్లు పడగొట్టి ఈ ఫీట్ నాలుగో సారి సాధించాడు.
It is time to give Ravichandran Ashwin his due 👏
— Sport360° (@Sport360) October 1, 2024
He is now the joint-leader for most Player-of-the-Series awards in Tests 🏆🥇 pic.twitter.com/JFekCzKFDA