BGT 2024-25: హెడ్, కమ్మిన్స్ కాదు.. ఆ ఒక్కడు లేకపోతే టీమిండియా సిరీస్ గెలిచేది: అశ్విన్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఎన్నో అంచనాల మధ్య ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత్ ఆతిధ్య ఆస్ట్రేలియా జట్టుపై 1-3 తేడాతో ఓడిపోయింది. తొలి మ్యాచ్ లో గెలిచి సిరీస్ లో శుభారంభం చేసినప్పటికీ.. ఆ తర్వాత ఆడిన 4 టెస్టుల్లో మూడు మ్యాచ్ లు ఓడిపోయింది. భారత వైఫల్యానికి చెత్త బ్యాటింగ్ కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన వసరం లేదు. ఓపెనర్ జైశ్వాల్ మాత్రమే పర్వాలేదనిపిస్తే మిగిలిన వారు విఫలమయ్యారు. అయితే టీమిండియా సిరీస్ ఓటమికి ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్ కారణమని చెప్పుకొచ్చాడు.  

“సిడ్నీలో జరిగే టెస్ట్ వరకు భారత్ కు సిరీస్ ను నిలబెట్టుకునే అవకాశం ఉంది. చివరి రోజు వరకు భారత్ పోరాడిన.. అద్భుతంగా ఆడిన ఆస్ట్రేలియా సిరీస్ గెలుచుకుంది. పాట్ కమ్మిన్స్ కు ఇది గొప్ప సిరీస్. అతను లెఫ్ట్ హ్యాండర్ లను ఔట్ చేసి తీవ్ర ప్రభావం చూపించాడు. స్కాట్ బోలాండ్ జట్టులోకి రావడం ఆస్ట్రేలియా అదృష్టమే. బోలాండ్ ఈ సిరీస్ లో ఆడకపోతే భారత్ సిరీస్ గెలుచుకునేది. జోష్ హేజిల్‌వుడ్‌కు అద్భుతమైన బౌలర్ అయినప్పటికీ ఒకవేళ ఆస్ట్రేలియా అతన్ని కొనసాగించినట్లయితే సిరీస్ మేమే గెలిచేవాళ్ళం". అని అశ్విన్ తన యూ ట్యూబ్ ఛానల్ ద్వారా తెలిపాడు. 

Also Read :- క్రికెటర్ల PR ఏజెన్సీలు నిషేధించాలి.. బాంబ్ పేల్చిన హర్ష భోగ్లే

జోష్ హేజిల్‌వుడ్ గాయంతో అతని స్థానంలో ఆస్ట్రేలియా స్కాట్ బోలాండ్ ను ఆడించింది. ఐదు టెస్టుల్లో మూడు టెస్ట్ మ్యాచ్ ల్లో అతనికి ఆడే అవకాశం లభించగా.. మూడు టెస్టుల్లో ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆడిన మూడు టెస్టుల్లో 6 ఇన్నింగ్స్ ల్లో ఏకంగా 21 వికెట్లు పడగొట్టాడు. అతని సగటు కేవలం 13.19 సగటు కాగా.. స్ట్రైక్ రేట్ 29.04. సిరీస్ లో చివరిదైన సిడ్నీ టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో 10 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. ఓవరాల్ గా ఈ సిరీస్ లో బుమ్రా (32), కమ్మిన్స్ (26) తర్వాత అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా నిలిచాడు.