న్యూజిలాండ్ తో నేడు (మార్చి 11) ముగిసిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా అద్భుత విజయాన్ని సాధించింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 279 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. ఒకదశలో 34 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి ఓటమి ఖాయమన్న జట్టును మార్ష్, క్యారీ నిలబెట్టారు. ఆరో వికెట్ కు 140 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆసీస్ కు మర్చిపోలేని విజయాన్ని అందించారు. చివర్లో ప్యాట్ కమ్మిన్స్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించింది.
Also Read : టీమిండియా పాకిస్థాన్ వెళ్తుందా.. పీసీబీ కొత్త ఛైర్మన్ ఏమన్నాడంటే..?
ఈ విజయంతో ఆస్ట్రేలియా సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. 98 పరుగులు చేసి జట్టును గెలిపించిన క్యారీకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కంగారూల గెలుపుకు అశ్విన్ ఫిదా అయ్యాడు. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, క్యారీను ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. కమ్మిన్స్ దిగ్గజ ఆటగాడిలా ఆడాడని.. క్యారీ పోరాటం అద్భుతమని ఆసీస్ జట్టుకు శుభాకాంక్షలు అని అశ్విన్ తన ఎక్స్ లో తెలిపాడు. ఈ మ్యాచ్ లో 220 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఆసీస్ కు కమ్మిన్స్, క్యారీ మరో వికెట్ పడకుండా అజేయంగా 61 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపించారు.
ఈ టెస్ట్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ కేవలం 162 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ పేస్ బౌలర్ హేజల్ వుడ్ 5 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా లబుషేన్ 90 పరుగులు చేయడంతో 256 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ లో బాగా ఆడిన న్యూజిలాండ్ సమిష్టిగా రాణించడంతో 372 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసి మ్యాచ్ తో పాటు సిరీస్ ను కైవసం చేసుకుంది.
Pat Cummins 👏👏legendary stuff and well done to Alex Carey 👌👌.
— Ashwin 🇮🇳 (@ashwinravi99) March 11, 2024
After the kind of summer Carey has had, all the backing from the team management has paid dividends.#AUSvNZ