
ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. బుధవారం జరిగిన గ్రూప్–ఎ మ్యాచ్‌లో కివీస్ 60 రన్స్ తేడాతో ఆతిథ్య పాకిస్తాన్‌కు షాకిచ్చింది. ఈ మ్యాచ్ లో పాక్ ఓటమి స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ కొంపముంచింది. 321 పరుగుల లక్ష్య ఛేదనలో నిదానంగా బ్యాటింగ్ చేయడమే ఇందుకు కారణం. ఆట ప్రారంభం నుంచి స్లో గా ఆడిన బాబర్.. ఏ దశలోనూ పరుగుల వేగాన్ని పెంచలేకపోయాడు. 90 బంతుల్లో 64 పరుగులు చేసి ఔటయ్యాడు. బాబర్ స్లో ఇన్నింగ్స్ పై టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
బాబర్ బ్యాటింగ్ ను విమర్శిస్తూ "ది టార్టాయిస్ అండ్ రాబిట్ స్టోరీ"లో బాబర్ బ్యాటింగ్ తనకు తాబేలును గుర్తియు చేసిందని అశ్విన్ తన ఎక్స్ లో రాసుకొచ్చాడు. బాబర్, అఘా సల్మాన్ మధ్య భాగస్వామ్యం చూస్తుంటే బాబర్ తాబేలులా.. అఘా బ్యాటింగ్ తనకు కుందేలులా అనిపించిందని అశ్విన్ ఈ పాక్ స్టార్ బ్యాటర్ పై సెటైర్ విసిరాడు. ఈ మ్యాచ్ లో బాబర్ 70 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తే అఘా సల్మాన్ మాత్రం 150 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. ఓవరాల్ గా అఘా 28 బంతుల్లో 6 ఫోర్లు.. ఒక సిక్సర్ తో 42 పరుగులు చేసి ఔటయ్యాడు.
Also Read:-పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి స్టార్ ఓపెనర్ ఔట్
ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 320/5 స్కోరు చేసింది.టామ్ లాథమ్ (118 నాటౌట్), విల్ యంగ్ (107) సెంచరీలతో కివీస్ కు భారీ స్కోర్ అందించారు. నాలుగో వికెట్‌కు 118 రన్స్ జత చేసిన తర్వాత యంగ్ ఔటైనా.. లాథమ్ చివరి వరకు క్రీజులో ఉండి భారీ స్కోరు అందించాడు. చివర్లో గ్లెన్ ఫిలిప్స్ (61) ఫోర్లు, సిక్స్‌లతో భారీ హిట్టింగ్ చేశాడు. తర్వాత ఛేజింగ్‌లో పాకిస్తాన్ 47.2 ఓవర్లలో 260 రన్స్‌కే ఆలౌటై ఓడింది. బాబర్ ఆజమ్ (64), కుష్దిల్ షా (69) హాఫ్ సెంచరీలు చేసినా ఫలితం లేకపోయింది.
Babar’s journey to 50 coupled with Salman Ali Agha’s batting has to be the best depiction of “ The Tortoise and Rabbit story” . #ChampionsTrophy
— Ashwin 🇮🇳 (@ashwinravi99) February 19, 2025
The 50 I hope will come soon enough🤞