IND vs ENG 4th Test: కుంబ్లే రికార్డ్ బ్రేక్.. టీమిండియా ఆల్‌టైం టాప్ స్పిన్నర్‌గా అశ్విన్

IND vs ENG 4th Test: కుంబ్లే రికార్డ్ బ్రేక్.. టీమిండియా ఆల్‌టైం టాప్ స్పిన్నర్‌గా అశ్విన్

టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భారత పిచ్ లపై మ్యాచ్ జరుగుతుందంటే చెలరేగిపోతాడు. ప్రస్తుతం టెస్టుల్లో ఈ ఆఫ్ స్పిన్నర్ రికార్డులన్నీ తన పేరిట లిఖించుకునే పనిలో ఉన్నాడు. రాజ్ కోట్ టెస్ట్ లో 500 వికెట్లు పూర్తి చేసుకొని చరిత్ర సృష్టించాడు. దీంతో భారత్ తరపున వేగంగా ఈ ఘనతను సాధించిన ఆటగాడిగా నిలిచాడు. తాజాగా ఇంగ్లాండ్ పై జరుగుతున్న రాంచీ టెస్టులో మూడు వికెట్లు తీసుకొని భారత గడ్డపై ఆల్ టైం బెస్ట్ స్పిన్నర్ గా నిలిచాడు.
 
రాంచీ టెస్టులో అశ్విన్ అదరగొట్టేస్తున్నాడు. డకెట్(15), పోప్ (0), రూట్ (11) వికెట్లు తీసుకొని భారత దిగ్గజ స్పిన్నర్ అనీల్ కుంబ్లే రికార్డ్ బ్రేక్ చేశాడు. టెస్టుల్లో భారత గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. కుంబ్లే భారత గడ్డపై 350 వికెట్లు తీశాడు. తాజాగా రూట్ వికెట్ తీసుకున్న అశ్విన్.. 351 వికెట్లతో అగ్ర స్థానంలో నిలిచాడు. హర్భజన్ సింగ్(265), కపిల్ దేవ్(219), రవీంద్ర జడేజా(210) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.

అశ్విన్ విజృభించడంతో రాంచీ టెస్ట్ హోరాహోరీగా జరుగుతుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 23 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని 141 లీడ్ సాధించింది. క్రీజ్ లో బెయిర్ స్టో (20), క్రాలి (49) ఉన్నారు. మూడు వికెట్లు అశ్విన్ కే దక్కాయి.