
పాకిస్థాన్ కు వరుస పరాజయాలు పలకరిస్తున్నా.. ఆల్ రౌండర్ సల్మాన్ అఘా మాత్రం తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు. అంచనాలకు మించి రాణిస్తూ జట్టులో కీలక ప్లేయర్ గా మారాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొడుతూ అందరి దగ్గర నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. ట్రై సిరీస్ లో సౌతాఫ్రికాపై వీరోచిత సెంచరీ చేసి మ్యాచ్ గెలిసిపించిన ఈ ఆల్ రౌండర్.. ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో 27 బంతుల్లోనే 42 పరుగులు చేసి మెరుపు ఇనింగ్స్ ఆడాడు. సల్మాన్ అఘా క్రికెట్ ఆడే తీరు టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ కు ఎంతగానో నచ్చింది. ఈ పాక్ ఆటగాడి ఆటపై ప్రశంసలు కురిపించాడు.
అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ "ఆష్ కి బాత్" మాట్లాడుతూ ఇలా అన్నాడు.."నేను పాకిస్థాన్ లోని ఇద్దరు ఆటగాళ్ల గురించి చెప్పడానికి ఆసక్తిగా ఉన్నాను. వారిద్దరూ తయ్యబ్ తాహిర్, సల్మాన్ అలీ అఘా. సల్మాన్ అఘా చాలా ప్రమాదకర ఆటగాడు. చాలా క్వాలిటీ ఆటతో పాటు ఒత్తిడిలో రాణించగల సామర్ధ్యం ఉంది. చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఇలాంటి పాకిస్థాన్ ఆటగాడిని చూస్తున్నాను. అతను ఇతర ఆటగాళ్లలాగా ఆడకూడదని నేను కోరుకుంటున్నాను. పాకిస్తాన్ క్రికెట్‌కు సల్మాన్ పోస్టర్ బాయ్‌గా మారగలడు. బాబర్ ఆజం, రిజ్వాన్‌లను అధిగమించగల సామర్థ్యం అతనిలో ఉందని నేను నమ్ముతున్నాను."అని ఈ టీమిండియా వెటరన్ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు.
ALSO READ | Champions Trophy 2025: దంచికొట్టిన సఫారీలు.. ఆఫ్ఘనిస్తాన్ ముందు భారీ లక్ష్యం
31 ఏళ్ల సల్మాన్ 33 వన్డేల్లో 915 పరుగులు సాధించాడు. సెంచరీతో పాటు ఐదు హాఫ్ సెంచరీలు అతనై ఖాతాలో ఉన్నాయి. బౌలింగ్ లోనూ రాణించి 5.50 ఎకానమీ రేటుతో 16 వికెట్లు కూడా పడగొట్టాడు. 110 లిస్ట్-ఎ మ్యాచ్‌ల్లో 3,000 పరుగులు చేయడంతో పాటు 89 వికెట్లు తీశాడు. ఈ ఇంటర్వ్యూ లో మిడిల్ ఆర్డర్ తయ్యబ్ తాహీర్ తో పాటు పాకిస్థాన్ ఓపెనర్ ఫకర్ జమాన్ గురించి మాట్లాడాడు. మిడిల్ ఆర్డర్ లో తాహీర్ ప్రమాదకర ఆటగాడని చెప్పాడు. చాలా రోజుల తర్వాత ఫఖర్ జమాన్ జట్టులో చేరడం సంతోషంగా ఉందన్నాడు.
Ashwin has high praise for Agha Salman, calling him a standout player who could surpass Babar Azam and Mohammad Rizwan due to his impressive skill set. #TOKSports #RavichandranAshwin #salmanaliagha #ICCChampionsTrophy pic.twitter.com/jLOHQAiSzX
— TOK Sports (@TOKSports021) February 20, 2025