ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమరం ప్రారంభం కానుంది. వన్డే ఫార్మాట్ లో టాప్ 8 జట్లు ఆడే ఈ టోర్నీపై భారీ హైప్ నెలకొంది.పాకిస్తాన్,దుబాయ్ వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. పాకిస్థాన్ లోని లాహోర్, కరాచీ, రావల్పిండి ఎనిమిది జట్లు ఆడే ఈ టోర్నమెంట్‌లో మొత్తం 10 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ మెగా ఈవెంట్ కు ముందు టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండాలనే దానిపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవి చంద్రన్ తన అభిప్రాయాన్ని తెలిపాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ తుది జట్టులో సుందర్ ఖచ్చితంగా ఉండాలని అశ్విన్ సూచించాడు. భారత్ తమ తుది జట్టులో ముగ్గురు స్పిన్ ఆల్ రౌండర్లు ఉండాలని.. అందులో సుందర్ ఒకడు అర్హుడని తెలిపాడు. “ ఛాంపియన్స్ ట్రోఫీలో జడేజాను ఆరో స్థానంలో.. హార్దిక్ పాండ్యను ఏడో స్థానంలో.. సుందర్ 8వ స్థానంలో ఆడతారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తో పాటు ఇద్దరు పేసర్లు సరిపోతారు. బ్యాటింగ్ బాగా చేయగలడని సుందర్ కు గంభీర్ ఛాన్స్ లు ఇస్తూ వస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో సుందర్ కు స్థానం దక్కుతుందని ఆశిస్తున్నా.
ఓపెనర్లుగా రోహిత్ శర్మ, గిల్ ఆడతారు. కోహ్లీ తన మూడో స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడు. అయ్యర్, రాహుల్ నాలుగు, ఐదు స్థానాలకు సరిపోతారు. లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్లు అయినప్పటికీ యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ బెంచ్ కి .పరిమితం కాక తప్పదు. ఎవరైనా బ్యాటర్ గాయపడితేనే జైశ్వాల్ కు అవకాశం దక్కుతుంది. వరుస సెంచరీలు కొట్టాడని జైశ్వాల్ కు ఛాన్స్ ఇస్తే బ్యాటింగ్ ఇస్తే బ్యాటింగ్ ఆర్డర్ దెబ్బ తింటుంది". అని అశ్విన్ తన యూ ట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పుకొచ్చాడు.