ముల్తాన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో పాక్ బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు. పిచ్ బౌలర్లకు సహకారం అందించకపోవడంతో పాక్ బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు. ఓవర్‌కు ఐదారు పరుగుల చొప్పున వన్డే తరహాలో పరుగులు వస్తున్నాయి. ప్రస్తుతం 117 ఓవర్లలోనే 6 వికెట్ల నష్టానికి 432 పరుగులు చేసింది. ముల్తాన్ పిచ్‌పై బౌలర్లకు ఎలాంటి సహకారం లభించడం లేదు. స్వింగ్ సంగతి దేవుడెరుగు కనీస బౌన్స్ కూడా అవ్వట్లేదు. దాంతో బ్యాటర్లు అలవోకగా పరుగులు చేస్తున్నారు.
తొలి రోజు ఆటలో భాగంగా షాన్ మసూద్, అబ్దుల్లా షఫీక్ వికెట్ పడగొట్టడానికి ఇంగ్లాండ్ నానా అవస్థలు పడింది. ఇదే విమర్శలకు దారితీస్తోంది. ఈ మ్యాచ్ పై టీమిండియా స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ ఒక్క రోజుకే మ్యాచ్ డ్రా అవుతుందని జోస్యం చెప్పాడు. మాస్టర్ మైండ్ అశ్విన్ అప్పుడే తన ప్రిడిక్షన్ చెప్పాడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అశ్విన్ చెప్పాడంటే జరగాల్సిందే అని నెటిజన్స్ ఫిక్స్ అయిపోతున్నారు.
Also Read : నా కుమారుడికి రూ.5 కోట్లు
ఈ మ్యాచ్ విషయానికి మొదట బ్యాటింగ్ చేస్తున్న పాకిస్థాన్.. కెప్టెన్ షాన్ మసూద్ (151), ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (102) సెంచరీలతో సత్తా చాటడంతో ఇంగ్లండ్‌తో మొదలైన తొలి టెస్టులో పాకిస్తాన్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. మరో ఓపెనర్ సైమ్ ఆయుబ్ (4)ను మూడో ఓవర్లోనే అట్కిన్సన్ ఔట్ చేసినా.. మసూద్, షఫీక్ రెండో వికెట్‌కు 253 రన్స్ జోడించారు. ప్రస్తుతం పాకిస్థాన్ 6 వికెట్ల నష్టానికి 432 పరుగులు చేసింది. క్రీజ్ లో సౌద్ షకీల్ (74),అఘా సల్మాన్ (27) ఉన్నారు.