Ravichandran Ashwin: చెన్నై చేరుకున్న అశ్విన్.. ఎయిర్ పోర్ట్‌కు వచ్చిన భార్య, పిల్లలు

Ravichandran Ashwin: చెన్నై చేరుకున్న అశ్విన్.. ఎయిర్ పోర్ట్‌కు వచ్చిన భార్య, పిల్లలు

టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం (డిసెంబర్ 18) బ్రిస్బేన్ టెస్ట్ ముగిసిన అనంతరం అశ్విన్ తన రిటైర్మెంట్ ను  అధికారికంగా ప్రకటించాడు. సిరీస్ మధ్యలో గుడ్ బై చెప్పడంతో ఈ వెటరన్ స్పిన్నర్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి రెండు టెస్టులు ఆడే అవకాశం లేకుండా పోయింది. డ్రెస్సింగ్ రూమ్ లో గ్రాండ్ సెలెబ్రేషన్స్ తర్వాత అశ్విన్ బుధవారం బ్రిస్బేన్ నుంచి భారత్ కు బయలుదేరాడు. 

గురువారం (డిసెంబర్ 19) ఈ దిగ్గజ స్పిన్నర్ తన సొంతగడ్డ చెన్నైకు చేరుకున్నాడు. చెన్నై ఎయిర్ పోర్ట్ కు దిగగానే అశ్విన్ కు గ్రాండ్ వెల్కమ్ దక్కింది. అశ్విన్ ను చూడడానికి అతని భార్య, పిల్లలు ఎయిర్ పోర్ట్ కు రావడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఈ 38 ఏళ్ళ స్పిన్నర్ తర్వాత ఏం చేస్తాడో చూడాలి. ఐపీఎల్ లో మాత్రం అశ్విన్ కొనసాగనున్నాడు. 2025 లో అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. మెగా ఆక్షన్ లో ఈ స్పిన్నర్ ను రూ. 9 కోట్ల రూపాయలకు చెన్నై దక్కించుకుంది. 

Also Read:-అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు.. అశ్విన్‌కు ఆస్ట్రేలియా ప్లేయర్లు స్పెషల్ గిఫ్ట్..

మూడు ఫార్మాట్లలో కలిపి అశ్విన్ మొత్తంగా 756 వికెట్లు పడగొట్టాడు. కెరీర్‌‌‌‌లో 106 టెస్టులు ఆడిన అతను 537 వికెట్లు తీశాడు. అనిల్ కుంబ్లే  (619)తర్వాత ఈ ఫార్మాట్‌‌లో అత్యధిక వికెట్లు తీసిన ఇండియా బౌలర్‌‌‌‌గా నిలిచాడు. ఓవరాల్‌‌ జాబితాలో ఏడో బౌలర్‌‌‌‌గా ఉన్నాడు.  క్లబ్‌‌ క్రికెట్‌‌లో కొనసాగుతానని చెప్పిన అశ్విన్ వచ్చే ఐపీఎల్‌‌లో సీఎస్కే తరఫున కెరీర్‌‌‌‌ కొనసాగించనున్నాడు.

మీడియా సమావేశం తర్వాత  డ్రెస్సింగ్‌‌కు వెళ్లి తోటి ఆటగాళ్లను హగ్ చేసుకొని సెండాఫ్​ ఇచ్చాడు. జట్టు నుంచి తప్పుకుంటున్నా.. ఎవ్వరికి  ఏ అవసరం ఉన్నా తాను ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉంటానని చెప్పాడు.  ‘ప్రతి ఒక్కరికీ తప్పుకొనే టైమ్‌‌ వస్తుంది. ఈ రోజు నా సమయం వచ్చింది' అని తన వీడ్కోలు ప్రసంగంలో అశ్విన్‌‌  పేర్కొన్నాడు.        

అశ్విన్ ఇప్పటివరకు భారత్ తరపున 106 టెస్టుల్లో 200 ఇన్నింగ్స్ ల్లో బౌలింగ్ చేశాడు. 537 వికెట్లు తీసి భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. బ్యాటింగ్ లోనూ మెరిసి 3503 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. 116 వన్డేల్లో 156 వికెట్లు.. 65 టీ20ల్లో 72 వికెట్లు పడగొట్టాడు.