IND vs ENG: ఇది కదా రికార్డు అంటే: 73 సెకన్లలోనే ఓవర్ పూర్తి చేసిన జడేజా

IND vs ENG: ఇది కదా రికార్డు అంటే: 73 సెకన్లలోనే ఓవర్ పూర్తి చేసిన జడేజా

కటక్ వేదికగా ఇంగ్లాండ్ తో ఆదివారం (ఫిబ్రవరి 9) జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన బౌలింగ్ తో ఆశ్చర్యానికి గురి చేశాడు. కేవలం 73 సెకన్లలో ఓవర్ పూర్తి చేసి ఔరా అనిపించాడు. ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ లో జడేజా బౌలింగ్ లో బ్రూక్ పూర్తిగా డిఫెన్స్ కే పరిమితమయ్యాడు. అతను మొత్తం మిడిల్, లెగ్-స్టంప్ చుట్టూ  బంతులు వేశాడు. ఒక్క బంతిని కూడా షాట్ ఆడేందుకు ప్రయత్నించలేదు. వరుసగా డాట్ బాల్స్ వేయడంతో ఓవర్ ఫాస్ట్ గా అయిపోయింది. 

ఇన్నింగ్స్‌లో ఇదే మొదటి మెయిడెన్ ఓవర్ కావడం విశేషం. జడేజా ఫాస్ట్ గా ఓవర్ పూర్తియు చేయడంతో కామెంటేటర్లు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక నెటిజన్స్ జడేజాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్ లో మొత్తం 10 ఓవరాల్ పాటు బౌలింగ్ చేసిన జడేజా కేవలం 35 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. మిగిలిన బౌలర్లందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా.. జడేజా ఇంగ్లాండ్ బ్యాటరలను పూర్తిగా కట్టడి చేశాడు.

ALSO READ | IND vs ENG: హిట్ మ్యాన్‌తో మాములుగా ఉండదు.. గేల్, ద్రవిడ్, సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన రోహిత్

ఈ మ్యాచ్ విషయానికి వస్తే రోహిత్ శర్మ మెరుపు సెంచరీ(90 బంతుల్లో 119: 12 ఫోర్లు, 7 సిక్సర్లు)తో  ఇంగ్లాండ్ ను చిత్తు చేస్తూ భారత్ 4 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసి గెలిచింది.