న్యూఢిల్లీ : ఇండియన్ క్రికెటర్లలో అందరికంటే ఎక్కువగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు డోప్ పరీక్షలు నిర్వహించారు. గత ఐదు నెలల కాలంలో అతని నుంచి మూడుసార్లు శాంపిల్స్‌ను సేకరించినట్లు నాడా (నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) ప్రకటించింది. మెన్, విమెన్ క్రికెటర్ల నుంచి ర్యాండమ్‌గా మొత్తం 58 శాంపిల్స్ సేకరించారు.
ఇందులో సగానికి పైగా ఔటాఫ్ కాంపిటీషన్‌లో తీసినవే ఉన్నాయి. ఈ ఐదు నెలల కాలంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి ఒక్క శాంపిల్ కూడా తీయలేదు. ఏప్రిల్‌లో హార్దిక్ పాండ్యా శాంపిల్‌ను సేకరించి పరీక్షించింది. అయితే ఒక్క క్రికెటర్ కూడా డోప్ టెస్టులో ఫెయిలవలేదు.