నిన్నటివరకు ఫీల్డింగ్ లో టాప్ టీం అనిపించుకున్న భారత్ నేడు పాక్ జట్టును తలపించింది. చేతులోకి వచ్చిన సులభమైన క్యాచులను జారవిడిచి మూల్యం చెల్లించుకున్నారు. ఒకటి రెండు కాదు ముగ్గురు తమ ఫీల్డింగ్ వైఫల్యాలతో కివీస్ కు ఊపిరి పోశారు. జడేజా లాంటి వరల్డ్ క్లాస్ ఫిల్డర్ కూడా క్యాచ్ జారవిడవడం ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో న్యూజీలాండ్ జట్టు భారీ స్కోర్ దిశగా వెళ్తుంది.
వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్ లో ఫీల్డింగ్ లో అలసత్వం ప్రదర్శిస్తే ఎలా ఉంటుందో మన ఆటగాళ్లకు బాగా తెలిసి వచ్చింది. ధర్మశాలలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో షమీ వేసిన 11 ఓవర్లో రచీన్ రవీంద్ర ఇచ్చిన క్యాచ్ ను జడేజా జారవిడిచారు. ఆ సమయంలో 12 పరుగుల వద్ద ఉన్న రచీన్.. ఆ తర్వాత మరో 63 పరుగులు చేసి 75 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. ఇక 33 ఓవర్లో కుల్దీప్ యాదవ్ మిట్చెల్ ఇచ్చిన ఈజీ క్యాచ్ ను లాంగ్ ఆఫ్ లో బుమ్రా వదిలేసాడు. ఈ సమయంలో 71 పరుగుల వద్ద ఉన్న మిచెల్ సెంచరీ పూర్తి చేసి కివీస్ కి భారీ స్కోర్ అందించాడు. ఇక రాహుల్ కూడా చేతిలోకి వచ్చిన క్యాచ్ ను మిస్ చేసాడు.
#INDvNZ BUMRAH ड्रॉप कैच मिचेल 71 pic.twitter.com/iSi1NUYsEf
— ARIF PINJARI (@ARIFPIN67248448) October 22, 2023
భారత్ ఫీల్డింగ్ వైఫల్యాలను అవకాశాలుగా మలుచుకున్న న్యూజీలాండ్ ప్రస్తుతం 44 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. మిచెల్ 109 పరుగులతో క్రీజ్ లో ఉండగా.. రాచీన్ రవీంద్ర 75 పరుగులు చేసి ఔటయ్యాడు. భారత బౌలర్లలో షమీ రెండు వికెట్లు తీసుకోగా.. సిరాజ్, కుల్దీప్ చెరో వికెట్ తీసుకున్నారు.