
టీమిండియా వెటరన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేల నుంచి రిటైర్మెంట్ అవుతాడనే వార్తలు వచ్చాయి. వయసు 36 ఏళ్ళ కావడంతో జడేజా మరో ఐసీసీ టోర్నీ ఆడే అవకాశం లేదనుకున్నారు. ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కోహ్లీని హత్తుకోగానే జడేజా వన్డేలకు వీడ్కోలు పలుకుతున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి. ఎందుకంటే గతంలో టీమిండియా స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్, ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ రిటైర్ అయ్యే ముందు కోహ్లీని హగ్ చేసుకోవడమే ఇందుకు కారణం. ఇదిలా ఉంటే తన రిటైర్మెంట్ వార్తలకు చెక్ పెడుతూ జడేజా క్లారిటీ ఇచ్చాడు.
"అనవసరమైన పుకార్లు వద్దు. ధన్యవాదాలు,' అని జడేజా ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు. దీంతో జడేజా పరోక్షంగా వన్డేల నుంచి రిటైర్మెంట్ అవ్వట్లేదని చెప్పకనే చెప్పాడు. దుబాయ్ వేదికగా ఆదివారం (మార్చి 9) న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో జడేజా అద్భుతంగా రాణించాడు.10 ఓవర్లు వేసి కేవలం 30 పరుగులే ఇచ్చి లాతమ్ వికెట్ పడగొట్టాడు. ఛేజింగ్ సమయంలో చివరి క్షణంలో విన్నింగ్ రన్స్ కొట్టి భారత్ కు విజయాన్ని అందించాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న జడేజా రోహిత్, కోహ్లీతో కలిసి 2027 వన్డే ప్రపంచ కప్ అడ్డునున్నట్టు స్పష్టంగా తెలిస్తుంది.
ALSO READ | Team India: ఎవరింటికి వాళ్ళే.. ఈ సారి బస్ పరేడ్ వేడుకలు లేవు.. కారణమిదే!
మ్యాచ్ తర్వాత జడేజా మాట్లాడుతూ.. " నేను ముందుగానే బ్యాటింగ్ కు వస్తే హీరోగానో, జీరోగానో ఉండేవాడిని. అదృష్టవశాత్తూ కేఎల్, హార్దిక్ కీలక భాగస్వామ్యంతో రాణించారు. మ్యాచ్ మార్పు తిప్పే భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముందుగానే బ్యాటింగ్ కు వచ్చి ఆడడం చాలా కష్టం. ఇది ఒక ముఖ్యమైన టోర్నమెంట్. దేశం తరపున టోర్నీ గెలవడం చాలా పెద్ద విషయం. చాలా కాలంగా జట్టు తరపున ఆడుతూ విన్నింగ్ సైడ్ లేకపోతే బాధపడాల్సి వస్తుంది. కానీ దేశానికి నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినందుకు నేను అదృష్టవంతుడిని" అని ఈ టీమిండియా ఆల్ రౌండర్ అన్నాడు.