శ్రీలంక పర్యటనలో భాగంగా టీమిండియా ఎంపికలో భాగంగా అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. కొంతమంది ప్లేయర్లకు లక్కీగా అవకాశం దక్కితే మరికొందరికి అన్యాయం జరిగింది. ఈ లిస్టులో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఉన్నాడు. శ్రీలంకతో జరగనున్న మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లకు ఇండియా టీమ్‌ను గురువారం ప్రకటించారు. అయితే ఈ టూర్ లో వన్డే జట్టులో జడేజాకు చోటు దక్కపోవడం ఆశ్చర్యకరంగా అనిపించింది.
వరల్డ్ కప్ 2024 తర్వాత జడేజా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేల్లో, టెస్టుల్లో కొనసాగుతానని చెప్పాడు. భారత జట్టులో దశాబ్ధకాలంగా సీనియర్ ఆల్ రౌండర్ గా జడేజా తనదైన ముద్ర వేశాడు. వన్డే జట్టులో అతనికి చోటు దక్కడం ఖాయమనుకున్నారు. అయితే ఈ స్పిన్ ఆల్ రౌండర్ కు సెలక్టర్లు బిగ్ షాక్ ఇచ్చారు. ఆల్ రౌండర్ల కోటాలో వాషింగ్ టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే లను ఎంపిక చేశారు. దీంతో జడేజాకు నిరాశ తప్పలేదు.
సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ శ్రీలంక సిరీస్ కు ఎంపికయ్యారు. మరోవైపు జస్ప్రీత్ బుమ్రా రెస్ట్ తీసుకున్నట్టు తేలింది. హార్దిక్ పాండ్య వ్యక్తిగత కారణాల వలన వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అయితే జడేజా విషయంలో క్లారిటీ రావడం లేదు. అతనికి రెస్ట్ ఇచ్చారో లేకపోతే జట్టు నుంచి తప్పించారో పెద్ద ప్రశ్నగా మారింది. వస్తున్న సమాచార ప్రకారం జడేజాను తప్పించారనే వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే టీ20లతో పాటు జడేజా వన్డే కెరీర్ ముగిసినట్టే.
Is it the end of the road for Sir Ravindra Jadeja in white-ball cricket? 😧#SLvIND #RavindraJadeja #TeamIndia pic.twitter.com/qqgGGFRjMo
— OneCricket (@OneCricketApp) July 19, 2024