మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీ (102 బ్యాటింగ్)తో కదం తొక్కడంతో టీమిండియా పటిష్ట స్థితికి చేరుకుంది. జడేజాకు తోడుగా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (61) కూడా తన బ్యాట్ కు పని చెప్పడంతో ఆట రెండో రోజు లంచ్ టైమ్ కు భారత్ స్కోరు 450 దాటింది. ఇవాళ్టి ఆటలో జడేజా బ్యాటింగ్ ను హైలైట్ గా చెప్పుకోవచ్చు. తనదైన శైలిలో బౌలర్లపై అటాక్ కు దిగిన జడ్డూ.. మొత్తం ఇన్నింగ్స్ లో పది బౌండరీలు బాదాడు. అతడికి అశ్విన్ కూడా మంచి సహకారం అందించాడు. ఇద్దరూ కలసి ఏడో వికెట్ కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఒకవైపు జడేజా తన కెరీర్ లో రెండో టెస్టు హండ్రెన్ ను కొట్టగా.. అశ్విన్ సుదీర్ఘ ఫార్మాట్ లో పన్నెండో అర్ధశతకాన్ని నమోదు చేశాడు. ప్రస్తుతం భారత్ ఏడు వికెట్ల నష్టానికి 468 పరుగులతో ఉంది. జడేజాతోపాటు జయంత్ యాదవ్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇక తన కెరీర్ లో వందో టెస్టు ఆడుతున్న మాజీ సారథి కోహ్లీ సెంచరీ చేయలేకపోయినా.. జడేజా శతక్కొట్టడం గమనార్హం.
'Rockstar' @imjadeja ??@Paytm #INDvSL pic.twitter.com/JG25othE56
— BCCI (@BCCI) March 5, 2022
మరిన్ని వార్తల కోసం: