పుష్పరాజ్ గెటప్లో అదరగొడుతున్న భారత క్రికెటర్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డాషింగ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో తెరకెక్కిన ‘పుష్ప’ మూవీ ఇప్పటికీ థియేటర్లలో దూసుకెళ్తోంది. హిందీలోనూ ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లను రాబడుతోంది. రీసెంట్ గా ఓటీటీలో విడుదలైన పుష్ప.. అక్కడ కూడా సత్తా చాటుతోంది. తగ్గేదేలే అంటూ స్పెషల్ డైలాగులు, పుష్పరాజ్ గా ప్రత్యేకమైన మ్యానరిజమ్స్, యాటిట్యూడ్ తో బన్నీ కనిపించిన తీరుకు సాధారణ ప్రేక్షకులే కాకుండా సెలబ్రిటీలూ ఫిదా అవుతున్నారు. ఈ లిస్టులో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా కూడా చేరిపోయాడు. పుష్ప మూవీ బాగా నచ్చడంతో తగ్గేదేలే అంటూ డైలాగు చెప్పి అలరించిన జడ్డూ.. ఇప్పుడు ఏకంగా పుష్పరాజ్ గెటప్ ను రీక్రియేట్ చేశాడు. 

నోట్లో బీడీ పెట్టుకుని పుష్ప రాజ్ లుక్ లో జడ్డూ మెరిశాడు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్న ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్.. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా.. ఫైరు’ అనే క్యాప్షన్ ను జత చేశాడు. అయితే.. ధూమ‌పానం, పొగాకు న‌మ‌ల‌డం ఆరోగ్యానికి మంచిది కాదని జడేజా స్పష్టం చేశాడు. తాను వాటిని ప్రోత్సహించనని చెప్పాడు. గ్రాఫిక్స్ లో మాత్రమే ఈ ఫొటో రూపొందించామ‌ని వివ‌రించాడు.

మరిన్ని వార్తల కోసం: 

ఎవరితో పొత్తుల్లేవ్.. ఒంటరి పోరాటమే

74 ఏండ్ల తర్వాత.. అన్నదమ్ములను కలిపిన కారిడార్

ముఖ్యమంత్రులతో ప్రధాని కీలక భేటీ