రివాబా జడేజా రాకతో తమ కుటుంబం విచ్చిన్నమైందంటూ రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్ సింగ్ జడేజా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పెళ్లైన మూడు నెలలకే రివాబా తమ కుటుంబంలో గొడవలు సృష్టించిందని ఆరోపించారు. ఆమెకు ఉమ్మడిగా కలిసి ఉండటం నచ్చేదికాదని, స్వతంత్ర జీవితాన్ని కోరుకునేదని తెలిపారు. ఆస్తులన్నింటిని తన కుమారుడైన రవీంద్ర జడేజా పేరు మీదకు మార్చుకోవాలని అతనిపై ఒత్తిడి తెచ్చేదని వెల్లడించారు.
"రివాబా నా కొడుకు మనస్సు మార్చేసింది. మా కుటుంబంలో చీలికలు తెచ్చింది. ఆమెకు తండ్రి తరుపు కుటుంబం అక్కర్లేదు. పెళ్ళైన మూడు నెలల్లోనే అన్నీ తన పేరు మీదకు మార్చుకోవాలని చెప్పేది. ఒకవేళ నేను తప్పు చేసి ఉండొచ్చు. రవీంద్ర సోదరి (నైనాబా) చెప్పింది తప్పు కావచ్చు. కానీ మీరు చెప్పండి. మా కుటుంబంలోని మొత్తం 50 మంది సభ్యులది తప్పు ఎలా అవుతుంది..? ప్రస్తుతం వారికి మా కుటుంబంలో ఎవరితోనూ సంబంధం లేదు. కేవలం ద్వేషం మాత్రమే ఉంది. నేను అతనికి పెళ్లి చేయకున్నా బాగుండేది. అతను క్రికెటర్‌గా మారకుండా ఉంటే ఇంకా బాగుండేది. అలా చేసుంటే ఇప్పుడు ఇవన్నీ అనుభవించాల్సిన అవసరం ఉండేది కాదు.." అని జడేజా తండ్రి ఆరోపించారు.
ALSO READ :- మా కుటుంబంలో చీలికలు రావడానికి రివాబానే కారణం: జడేజా తండ్రి ఆవేదన
నా భార్య చాలా మంచిది
రివాబాపై తన తండ్రి చేసిన వ్యాఖ్యలపై రవీంద్ర జడేజా ఖండించారు. ఈ వ్యాఖ్యలు నిరాధారమైనవని కొట్టిపారేశారు. బీజెపీ అభ్యర్థిగా జామ్‌నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న తన భార్య ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని జడేజా ఆరోపించారు. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నప్పటికీ బహిరంగంగా మాట్లాడటం ఇష్టం లేదని జడేజా స్పష్టం చేశారు.
Let's ignore what's said in scripted interviews ? pic.twitter.com/y3LtW7ZbiC
— Ravindrasinh jadeja (@imjadeja) February 9, 2024
15 ఏళ్లు
ఫిబ్రవరి 2009లో శ్రీలంకపై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన జడేజా గురువారం(ఫిబ్రవరి 8)తో 15 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. గాయం కారణంగా ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టుకు దూరమైన జడేజా.. మూడో టెస్టుకు సిద్దమవవుతున్నాడు. గాయం నుంచి అతను కోలుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.