అడ్డొచ్చిన అందరినీ వేసేయ్.. భార్యకు కత్తి సాము నేర్పిస్తున్న జడేజా

అడ్డొచ్చిన అందరినీ వేసేయ్.. భార్యకు కత్తి సాము నేర్పిస్తున్న జడేజా

కత్తి సాము, కఱ్ఱ సామూ.. నేటికాలంలో ఈ  విలువిద్యలు కనిపించట్లేదు కానీ, గతంలో ఏ గ్రామంలో చూసినా ఆ దృశ్యాలే. రాజాధి రాజులు తమ దేశ రక్షణ కోసమూ, తమ ఆత్మ రక్షణ కోసమూ అంగరక్షకులకు ఇలాంటి శిక్షణే ఇచ్చేవారు. పాలకులు కూడా ఈ విద్యలో ఆరితేరిన వారై యుండేవారు. క్రమక్రమంగా రాజులు, సామంత రాజుల పాలన ముగిసి ఆంగ్లేయులు దేశాన్ని హస్త గతం చేసుకోవడం, అత్యాధునిక మారణాయుధాలు రాకతో వీటి ప్రాముఖ్యం తగ్గి పోయింది. తిరిగి ఆ కల మరోసారి అక్కడక్కడా కనిపిస్తోంది.

నేటి కాలంలో ఆడపిల్లలు ఆత్మ ర‌క్ష‌ణ కోసం కత్తి సాము, కరాటే వంటి విలు విద్యల యందు శిక్షణ పొందుతున్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన సతీమణి రివాభా జడేజాకు కత్తి సాము విద్య యందు తర్ఫీదు ఇచ్చాడు. కత్తి ఎలా పట్టాలో.. ఎలా పోరాడాలో ఆమెకు తెలియ చెప్పాడు. అందుకు సంబంధించిన దృశ్యాలను రివాభా సోషల్ మీడియాలో పంచుకుంది.

అడ్డొచ్చిన అందరినీ వేసేయ్..

రివాభా కత్తితో కనిపించగానే అభిమానులు బాలయ్య డైలాగ్‌లు వినిపించడం మొదలుపెట్టారు. జడ్డు బంతితో.. మీరు కత్తితో అడ్డొచ్చిన అందరినీ వేసేయండి అంటూ మంచి మంచి డైలాగ్‌లు పోస్ట్ చేస్తున్నారు.