భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్ నుంచి చిన్న విరామం తీసుకున్నాడు. గుజరాత్ లోక్ సభ ఎన్నికల్లో అతని భార్య రివాబాతో కలిసి జడేజా మంగళవారం (మే 8) ఓటు వేశారు. ఓట్లు వేసిన తర్వాత జడేజా తన భార్యతో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో వారు ఓటు వేసిన ఫోటోను షేర్ చేశారు. ఓటు హక్కు వినియోగించుకొని “నా ఓటు, నా హక్కు” అని క్యాప్షన్ ఇచ్చాడు.
ప్రస్తుతం జడేజా ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతూ బిజీగా ఉన్నాడు. చివరిసారిగా పంజాబ్ పై జరిగిన ప్రదర్శనలో జడేజా ఆల్ రౌండ్ షో తో అదరగొట్టాడు. దీంతో పంజాబ్ కింగ్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ లో కీలకమైన 43 పరుగులు చేసిన జడ్డు.. తర్వాత బౌలింగ్ లోనూ విజృంభించి మూడు వికెట్లు తీసుకొని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ తమ తదుపరి మ్యాచ్ ను మే 10న గుజరాత్ టైటాన్స్ తో తలపడుతుంది. మ్యాచ్ సమయానికల్లా జడేజా అందుబాటులో ఉంటాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్ ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. అమెరికాకు వెళ్లే 15 మంది సభ్యుల భారత టీ20 జట్టులో జడేజా ఉన్నాడు.
Watch | Indian Cricketer Ravindra Jadeja casts his vote in Jamnagar, Gujarat pic.twitter.com/CkZf48m1EN
— DeshGujarat (@DeshGujarat) May 7, 2024