SL vs IND 2024: ఆ ఇద్దరినే నమ్ముకున్న టీమిండియా.. జడేజా వన్డే కెరీర్ ముగిసినట్టేనా..?

SL vs IND 2024: ఆ ఇద్దరినే నమ్ముకున్న టీమిండియా.. జడేజా వన్డే కెరీర్ ముగిసినట్టేనా..?

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వన్డే దారులు మూసుకుపోతున్నాయి. టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు జడేజా. అయితే  శ్రీలంకతో జరగనున్న మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌‌‌‌‌‌‌‌లకు ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌ను గురువారం (జూలై 18) ప్రకటించారు. ఈ టూర్ లో వన్డే జట్టులో జడేజాకు చోటు దక్కపోవడం ఆశ్చర్యకరంగా అనిపించింది.

ఆల్ రౌండర్ల కోటాలో వాషింగ్ టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే లను ఎంపిక చేశారు. దీంతో జడేజాకు నిరాశ తప్పలేదు. సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ శ్రీలంక సిరీస్ కు ఎంపికయ్యారు. మరోవైపు జస్ప్రీత్ బుమ్రా రెస్ట్ తీసుకున్నట్టు తేలింది. హార్దిక్ పాండ్య వ్యక్తిగత కారణాల వలన వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అయితే జడేజా విషయంలో క్లారిటీ రావడం లేదు.

సెలక్షన్ తర్వాత జడేజాకు రెస్ట్ ఇచ్చారని చెప్పకపోవడంతో అతని వన్డే కెరీర్ పై సందేహాలు నెలకొన్నాయి. జడేజా వన్డే కెరీర్ దాదాపుగా ముగిసిపోయిందని.. అతను ఇక వన్డేల్లో కనిపించకపోవచ్చని నివేదికలు తెలుపుతున్నాయి. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు శ్రీలంకలో మూడు వన్డేలతో సహా భారత్ మొత్తం ఆరు వన్డేలు మాత్రమే ఆడనుంది. దీంతో సెలెక్టర్లు అక్షర్ పటేల్ మరియు వాషింగ్టన్ సుందర్‌లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నారట. 

ప్రస్తుతం అక్షర్ పటేల్, సుందర్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. అద్భుతమైన బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ అదరగొడుతున్నారు. వీరిద్దరినీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు జడేజా ఈ మధ్య కాలంలో ఏమంత గొప్ప ఫామ్ లో లేడు. భారత్ వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ తేలిపోయిన జడేజా.. ఇటీవలే జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఘోరంగా విఫలమయ్యాడు. పైగా అతని వయసు 35 సంవత్సరాలు కావడం మైనస్ గా మారింది.

ALSO READ : పాక్‌‌‌‌ను చిత్తు చేసి... ఆసియా కప్‌‌‌‌లో ఇండియా శుభారంభం

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే జడేజాను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో జడేజా కేవలం టెస్ట్ క్రికెట్ లోనే కొనసాగనున్నాడు. వరల్డ్ కప్ 2024 తర్వాత జడేజా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేల్లో, టెస్టుల్లో కొనసాగుతానని చెప్పాడు. భారత జట్టులో దశాబ్ధకాలంగా సీనియర్ ఆల్ రౌండర్ గా జడేజా తనదైన ముద్ర వేశాడు.