దేవరకొండ, కొండమల్లేపల్లి, వెలుగు: కాంగ్రెస్, బీజేపీలు అధికారంలో కోసం మోసపూరిత హామీలు ఇస్తున్నాయని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఆరోపించారు. దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌తో పాటు కొండమల్లేపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యకర్తల మీటింగ్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పథకాలతో పాటు కాంగ్రెస్, బీజేపీ మోసాలను ప్రజలకు అర్థం అయ్యేలా వివరించాలని సూచించారు.
60 అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని, కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే తెలంగాణ అభివృద్ధి చెందిదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.