కేసీఆర్‌‌ను ఉపేక్షిస్తే పార్టీకే నష్టం: బీజేపీ లీడర్ ​రవీందర్​ నాయక్​

యాదాద్రి, వెలుగు: అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని అప్పుల పాలుజేసిన సీఎం కేసీఆర్​, ఆయన కుటుంబాన్ని ఉపేక్షిస్తే.. తెలంగాణలో బీజేపీకి నష్టం జరుగుతుందని ఆ పార్టీ లీడర్​, మాజీ ఎంపీ రవీంద్రనాయక్​ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం యాదాద్రి జిల్లా భువనగిరిలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై తెలంగాణ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయవద్దన్నారు.  ప్రజలను మోసం చేసిన కేసీఆర్‌‌పై బీజేపీ చర్యలు తీసుకుంటుందనే తాను పార్టీలో చేరానన్నారు. 

 తన ఆశలు అడియాశలు చేయవద్దని రెండు చేతులు ఎత్తి దండం పెట్టారు.  అధికారంలోకి వచ్చిన తొమ్మిదేండ్లలో కేసీఆర్‌‌ రూ. 3 లక్షల కోట్ల అప్పులు చేసి.. ప్రాజెక్టుల పేరిట అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే టీఆర్‌‌ఎస్‌ను బీఆర్‌‌ఎస్‌ మార్చారని విమర్శించారు.  భూములు స్కామ్‌లో దోచుకున్న డబ్బును ఇతర రాష్ట్రాల్లో బీఆర్​ఎస్​  విస్తరణ కోసం ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.