హిందువుల సహనాన్ని పరీక్షించొద్దు : రావినూతల శశిధర్

శంషాబాద్, వెలుగు: ఆలయాలపై దాడులు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించట్లేదని వీహెచ్​పీ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ అన్నారు. శంషాబాద్ మండల పరిధిలోని జూకల్​లో విగ్రహాల ధ్వంసమైన ప్రాంతాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ఇవి ఆలయాల మీద జరుగుతున్న దాడులు కావని, భారతదేశ సంస్కృతి, ప్రజలపై జరుగుతున్న దాడులని అభివర్ణించారు.

 దేశవ్యాప్తంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు 543 దేవాలయాలపై ఒక ప్రణాళికబద్ధంగా దాడులు జరిగాయన్నారు. హిందువుల సహనాన్ని పరీక్షించవద్దని, దాడుల వెనుక ఉన్న  ముఖ్య నిందితులను వెంటనే పట్టుకొని, కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో వీహెచ్​పీ శంషాబాద్ అధ్యక్షుడు వివేకా గుప్త, ఉపాధ్యక్షుడు నర్సింహ గౌడ్, చుక్కపూరి రాజు కార్యదర్శులు సురేశ్ చారి, దూడల సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.