Eagle Movie X Review: ఈగల్ మూవీ ఎలా ఉంది.. ఆడియన్స్ ఏమంటున్నారు?

మాస్ మహారాజా రవితేజ(Raviteja) హీరోగా వచ్చిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ఈగల్(Eagle). డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని(Karthik Gattamaneni) తెరకెక్కించిన ఈ సినిమాలో.. అనుపమ పరమేశ్వరన్(Anupama Parameshwaran), కావ్య థాపర్(Kavya Thapar), నవదీప్(Navadeep), అవసరాల శ్రీనివాస్(Avasarala Sirnivas) కీ రోల్స్ చేశారు. అవుట్ అండ్ అవుట్ స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాపై నేడే(ఫిబ్రవరి 9) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఎలా ఉంది? ఆడియన్స్ ఏమంటున్నారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

పలు వాయిదాల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈగల్ సినిమా షోస్ ఇప్పటికే చాలా చోట్ల ఫినిష్ కావడంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రయాణాన్ని పంచుకుంటున్నారు. ఇక ఈగల్ సినిమాకు సోషల్ మీడియాలో మిక్సుడ్ టాక్ వస్తోంది. ఈగల్ సినిమా విజువల్స్ పరంగా, క్వాలిటీ పరంగా నెక్స్ట్ లెవల్లో ఉందని, రవితేజ లుక్ కూడా అదిరిపోయిందని చెప్పుకుంటున్నారు. అయితే టెక్నీకల్ విషయాలపై పెట్టిన శ్రద్ధను కథ, కథనం విషయంలో కూడా తీసుకుంటే బాగుండేదని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక రవితేజ ఫ్యాన్ మాత్రం థియేటర్స్ లో పండుగ చేసుకుంటున్నారు. ఇది మాస్ మహారాజ్ వన్ మ్యాన్ షో అని, ఊరమాస్ ఊచకోత మొదలైందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాతో రవితేజ మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారని చెప్పుకుంటున్నారు. ఇక ఈగల్ సినిమా గురించి పూర్తి రివ్యూ రావాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.