మాస్ మహారాజా రవితేజ(Raviteja) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఈగల్(Eagle). రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు వంటి డిజాస్టర్ల తర్వాత రవితేజ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈగల్ సినిమాపై ముందు నుండి మంచి అంచనాలున్నాయి. స్టయిలీష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని(Karthik Gattamaneni) తెరకెక్కిచాడు. టీజర్, ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా శుక్రవారం(ఫిబ్రవరి 9)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
విడుదలైన రోజు ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన వచ్చింది. కొని యాక్షన్ సీన్స్ తప్పా సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదని కామెంట్స్ వచ్చాయి. దీంతో ఈ సినిమా ప్లాప్ అవనుందని అనుకున్నారంతా. కానీ, అనూహ్యంగా రరెండోరోజు టాక్ మొత్తం మారిపోయింది. కామన్ ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇక శనివారం లెక్కల ప్రకారం ఏపీ అండ్ తెలంగాణా పరంగా చూసుకుంటే బుకింగ్స్ లో ఈగల్ సినిమానే టాప్ లో నిలిచింది. దీంతో కలెక్షన్స్ మాత్రం బాగానే రాబడుతోంది ఈ మూవీ.
ఇక తొలి రోజు దాదాపు రూ.6 కోట్ల షేర్ సాధించిన ఈగల్ సినిమా రూ.11.90కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక రెండో రోజు రూ.4.5 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా రూ.7 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని సమాచారం. ఇక మొత్తంగా చూసుకుంటే రెండు రోజులకు గాను.. రూ.10 కోట్ల షేర్ రూ.17కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి డీసెంట్ గా రన్ అవుతోంది ఈ మూవీ.
ALSO READ :- OTTకి ట్రూ లవర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?
ఇక ఈగల్ మూవీ రూ.22కోట్ల థియేట్రికల్ బిజినెస్ తో బరిలోకి దిగింది. ఇప్పటివరకు 45 శాతం రికవరీ అయినట్లు సమాచారం. మరో రూ.12కోట్ల షేర్, రూ.25కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది ఈ మూవీ. ఇక ఆది వారం కూడా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. పెద్ద సినిమాలు కూడా పోటీకి లేవు కాబట్టి ఈ సినిమా ఈజీగా బ్రేకివెన్ అయ్యే అవకాశం ఉండాలి ట్రేడ్ వర్గాల అంచనా.