మాస్ మహారాజా రవితేజ(Raviteja)..టాలీవుడ్లో ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయన నుండి ఒక సినిమా వస్తుందంటే..ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు.అందుకే అనౌన్స్ మెంట్ నుండే ఆయన సినిమాలపై హైప్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది.అంతేకాకుండా ఆయన నుంచే వచ్చే సినిమాలన్నీ ఎక్కువగా కొత్త దర్శకులతో చేస్తుంటారు. అసలు ఒక స్టార్ హీరో న్యూ టాలెంట్స్ ని ఎంకరేజ్ చేయడమంటే మామూలు విషయం కాదు.ఇదొక పెద్ద సాహసం అని చెప్పుకోవాలి. అలాంటప్పుడే ఇండస్ట్రీలో మంచి అనే పదానికైనా..గ్రౌండ్ లెవల్ నుంచి వచ్చిన విషయాన్ని ఐనా..మరిచిపోలేని క్యారెక్టర్ అందరికీ కనిపిస్తోంది.
ఇదంతా ఇపుడు ఎందుకంటే..రవితేజ మరో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చినట్టు సమాచారం. శ్రీ విష్ణు నటించిన సామజవరగమన మూవీకి కథా రచయితగా పనిచేసిన భాను బోగవరపు చెప్పిన కథ రవితేజకి బాగా నచ్చేసిందట. ఇక అతడిని దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని డిసైడ్ అయినట్లు టాక్.
అయితే ఈ కథ పూర్తి కామెడీ ఎంటర్ టైన్ కావడంతో..వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ మధ్య మాస్ మహారాజా నుంచి ఎక్కువగా యాక్షన్ ఫిలిమ్స్ వస్తుండటంతో కామెడీ కథతో రావాలని రవితేజ కూడా అనుకుంటున్నట్లు సమాచారం.త్వరలో ఈ ప్రాజెక్ట్ నుంచి అఫిసియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.
రవితేజకు తొలి దర్శకులతో పనిచేయడం కొత్త కాదు,కానీ వారిలో చాలా తక్కువ మంది మాత్రమే అతనికి సంపూర్ణ విజయాన్ని అందించారు.రవితేజ కామెడీ జానర్ లో సినిమా చేస్తే మాత్రం అభిమానులు తప్పకుండా ఆదరిస్తారు.అందుకు ఉదాహరణగా చెప్పాలంటే..వెంకీ,కిక్,దుబాయ్ శీను వంటి బ్లాక్‌బస్టర్‌లు.ఈ సినిమాలో నుంచి వచ్చే మీమ్స్ ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. మరి రవితేజ కోసం ఈ డెబ్యూ డైరెక్టర్ ఎలాంటి కథ రెడీ చేస్తున్నాడో చూడాలి. ప్రస్తుతం రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీలో నటిస్తున్నాడు.