MASS JATHARA : మాస్ జాతర ఆప్ డేట్స్ .. జాన్వాడలో స్పెషల్‌‌ సెట్‌‌లో షూట్

MASS JATHARA : మాస్ జాతర ఆప్ డేట్స్ .. జాన్వాడలో స్పెషల్‌‌ సెట్‌‌లో షూట్

రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మాస్ జాతర’. సితార ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై  నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.  ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ శివారు ప్రాంతంలోని జాన్వాడలో వేసిన స్పెషల్‌‌ సెట్‌‌లో షూట్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌‌తో దాదాపు టాకీ పార్ట్‌‌ అంతా పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది. రవితేజ కెరీర్‌‌‌‌లో ఇది 75వ చిత్రం.  

ఇందులో ఆయన  పవర్‌‌‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌‌‌గా కనిపించనున్నాడు.  ‘ధమాకా’ తర్వాత మరోసారి రవితేజకు జంటగా శ్రీలీల హీరోయిన్‌‌గా నటిస్తుంటే, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించడం సినిమాపై బజ్‌ను పెంచింది. సమ్మర్‌‌‌‌లో సినిమా రిలీజ్‌‌కు ప్లాన్ చేస్తున్నారు.  ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ మూవీ గ్లింప్స్‌‌ సినిమాపై అంచనాలు పెంచింది. మరోవైపు దీని తర్వాత కిశోర్ తిరుమల డైరెక్షన్‌‌లో రవితేజ సినిమా ఉండనుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌‌మెంట్ రానుంది.