‘క్రాక్’ బ్లాక్ బస్టర్ తర్వాత వరుసగా మూడు సినిమాల్ని లైన్‌లో పెట్టిన రవితేజ, తాజాగా మరో రెండు సినిమాలకు సైన్ చేశాడు. అంతేకాదు.. ఆ సినిమాల డిటెయిల్స్‌ని వెంటవెంటనే రివీల్ చేస్తున్నాడు. తన అప్‌కమింగ్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ టైటిల్ పోస్టర్‌ను దీపావళి సందర్భంగా రిలీజ్ చేశారు. ‘ఫీల్ ది సైలెన్స్ బిఫోర్ ద హంట్’ అనే క్యాప్షన్‌తో వదిలిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. పంచె కట్టుకుని నడిచి వెళ్తున్న వ్యక్తి పాదముద్రలు పులి అడుగుజాడల్లా ఉన్నాయి. 1970 బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథ ఇది. అప్పట్లో స్టూవర్ట్‌పురంలో నివసించిన నాగేశ్వరరావు అనే గజదొంగ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. వంశీ దర్శకుడు. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలకానుంది. రవితేజకి ఇదే ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమా. శ్రీకాంత్ విస్సా మాటలు, జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. గత మూడేళ్లుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, సరికొత్త బాడీ లాంగ్వేజ్, యాసతో రవితేజ ఆకట్టుకోబోతున్నాడని మేకర్స్ చెప్పారు. కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్న లైఫ్ స్టోరీ కావడంతో చాలాకాలంగా టైగర్ జీవితంపై సినిమా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆమధ్య
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘స్టూవర్ట్‌పురం దొంగ’ పేరుతో అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. అదే వ్యక్తి జీవిత కథతో రవితేజ హీరోగా ఈ సినిమా రాబోతోంది.