మాస్ మహారాజ్ టైగర్ నాగేశ్వర రావు సెకండ్ లిరికల్ అప్డేట్

మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వర రావు(Tiger Nageshwara rao). భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు వంశీ(Vamshee) తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ అంచనాలు అమాంతం పెంచేశాయి. దీంతో టైగర్ నాగేశ్వర రావు సినిమా కోసం రవితేజ ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ALSO READ: శృతి హాసన్ కు వేధింపులు..వెంటపడ్డ అగంతుకుడు

లేటెస్ట్ గా  సెకండ్ లిరికల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల (సెప్టెంబర్ 21న) వీడు(Veedu )..అనే మాస్ సాంగ్ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. నోట్లో బిడీ .. చుట్టూరా విలన్ గ్యాంగ్ తో రిలీజ్ చేసిన పోస్టర్ చాలా మాస్ గా కనిపిస్తుంది. ఈ మూవీకి తమిళ సంగీత దర్శకుడు జీవి ప్ర‌కాశ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. 

రీసెంట్గా ఈ మూవీ నుంచి వచ్చిన ఏక్‌‌‌‌ ధమ్.. ఏక్‌‌‌‌ ధమ్ సాంగ్ ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సెకండ్ సింగిల్ తో మాస్ ఆడియన్స్ కు కిక్ ఇస్తుందని తెలుస్తోంది. 
ఇక 1970 కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్‌ దొంగగా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నుపుర్‌ సనన్‌(Nupur saono) హీరోయిన్ గా నటిస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మురళి శర్మ, రేణు దేశాయ్, గాయత్రీ భార్గవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.