మాస్ మహారాజ రవితేజ(Raviteja) హీరోగా వస్తున్న పాన్ మొదటి పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరావు(Tiger nageswararao). ఇండియన్ రాబిడ్ హుడ్‌గా పేరుతెచ్చుకున్న గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ అధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. దీంతో ఈ సినిమా నుండి వస్తున్న చిన్న అప్డేట్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది.
??? ????????? ????? ???? ?? ????????? ?#TigerNageswaraRao ? TRAILER OUT ON OCTOBER 3rd ?? pic.twitter.com/L9BpD9G0lh
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) September 26, 2023
ఇక తాజాగా ఈ సినిమా నుండి మరో సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. చాలా కాలంగా టైగర్ నాగేశ్వరావు ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. తాజాగా ట్రైలర్ కు సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమా ట్రైలర్ ను అక్టోబర్ 3న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ALSO READ : థ్రెడ్స్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఖాతాలను విడిగా డిలిట్ చేయొచ్చు.. క్రియేట్ చేయొచ్చు..
ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన టీజర్‌కు వీర లెవల్లో రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్‌తో ఆ అంచనాలను మరింత పెంచేలా ప్లాన్ చేస్తున్నారు చిత్రీయూనిట్. పీరియాడిక్ అండ్ రియల్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాకు కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఫేమ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నుపూర్ సనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.