టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. 1994, 2009లలో వనపర్తి నియోజకవర్గం నుంచి రావుల చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్‌గా పని చేశారు.
ALSO READ:ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ రెడ్డికి ఓటు వేద్దామా: మంత్రి కేటీఆర్
2002 నుంచి 2008 వరకు రాజ్యసభ సభ్యుడిగానూ పనిచేశారు. 2014లో టీడీపీ తరపున వనపర్తిలో పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. ఇక ఇదే కార్యక్రమంలో జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా బీఆర్ఎస్ లో చేరారు. బాలకృష్ణారెడ్డి తొందరపడి 2009లో బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయారని మంత్రి కేటీఆర్ అన్నారు. మళ్లీ అతను రాకతో తప్పిపోయిన కొడుకు తిరిగి ఇంటికి వచ్చినట్లు ఉందని చెప్పారు.