- ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరొకరు
- 8 లక్షల విలువైన పటిక, బెల్లం సీజ్
ఘట్ కేసర్, వెలుగు: సారాయి తయారీ ముడి సామగ్రిని తరలిస్తున్న ముగ్గురిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద రూ.8 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఘట్ కేసర్ ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ రవి తెలిపిన ప్రకారం.. గురువారం నారపల్లిలోని నందనవనం వద్ద వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఓ లారీ తప్పించుకునే యత్నిస్తుండగా ఆపి తనిఖీ చేశారు.
లారీలో 200 కేజీల పట్టిక, బెల్లం, 400 కేజీల అల్లం పేస్ట్ తో పాటు అనార్, జీకే కంపెనీల పొగాకు పాకెట్లను స్వాధీనం చేసుకోగా.. వాటి విలువ రూ. 8 లక్షలు ఉంటుంది. ముడి సామగ్రి తరలిస్తున్న అన్నోజిగూడకు చెందిన మాలోత్ శ్రీనివాస్(38), ఆగాపురాకు చెందిన సయ్యద్ సాదిక్(56), బేగంబజార్ కు చెందిన ఘన శ్యామ్ దాస్(56) ను అదుపులోకి తీసుకున్నారు.
మరో నిందితుడు మల్యాల సుమంత్ పరార్ అయ్యాడు. కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను రిమాండ్ కు తరలించారు. జిల్లా ఎక్సైజ్ ప్రొహిబిషన్ అధికారి కె. భరత్ భూషణ్, ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ రవి, ఎస్ఐలు శ్రీనివాస్ రెడ్డి, నందిని ఉన్నారు.