పచ్చి పసుపు వెర్సెస్ పసుపు పౌడర్..ఈ రెండింటిలో ఏది ఆరోగ్యకరమైంది అనే సందేహం చాలా మందిలోఉంటుంది. పసుపును మనం గోల్డెన్ స్పైసీగా పిలుస్తాం. దీనిని శతాబ్దాలుగా ఆయుర్వేదంలోనూ, పాక శాస్త్రంలోనూ అంటే వంటకాల్లో ఉపయోగిస్తున్నాం. శక్తివంతమైన రంగు, విలక్షణమైన రుచితో ఉండే ఈ పసుపును కేవలం రుచి కోసమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వాడుతుంటారు.అయితే పచ్చి పసుపు, పసుపు పౌడర్ లలో దేనిని ఎంచుకోవాలనే విషయానికి వస్తే చాలామంది పసుపు ఏరూపంలో తీసుకుంటే ఆరోగ్యకరం అని ఆలోచిస్తుంటారు. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది వాడితే మంచిది అనే విషయం గురించి తెలుసుకుందాం.
పోషకాలు
పచ్చి పసుపు దాని రూట్ రూపంలో విటమిన్ సి, విటమిన్ ఇ, ఫైబర్ తో సహా అనేక పోషకాలను కలిగిఉంటుంది. కర్కుమిన్ వంటి దాని సహజ నూనెలు చెక్కు చెదరకుండా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. అయితే పసుపును పౌడర్ గా చేసిన ప్పుడు కొన్ని పోషకాలు స్వల్ప నష్టానికి లోనవుతాయి. పసుపును ప్రాసెసింగ్ చేసినప్పుడు కర్కుమిన్ లో స్వల్ప నష్టం జరుగుతంది.
కర్కుమిన్ కంటెంట్
తాజా పసుపులో కర్కుమిన్ సహజ స్థితిలో ఉంటుంది. పండించే నేల నాణ్యత, పంట కోత విధానం వంటి వాటివల్ల కర్కుమిన్ తగ్గవచ్చు. పసుపు పొడిలో యితే కర్కుమిన్ కంటెంట్ ను మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఇది లోపించే అవకాశం ఉంది. కాబట్టి కొనేముందుకు కర్కుమిన్ శాతం చెక్ చేసుకోవాలి.
పచ్చి పసుపును నల్ల మిరియాలు, కొవ్వులు వంటి పదార్థాలతో తీసుకోవడం వల్ల సహజ నూనెలు కర్కుమిన్ శోషణను మెరుగు పరుస్తాయి. అయితే పసుపు పొడిలో జీవ లభ్యత కొరకు , కర్కుమిన్ శోషణను పెంచడానికి పైపెరిన్ లేదా కొవ్వుల వంటి సంకలితాలు కలపాల్సి రావచ్చు.