- సీఈసీ, చీఫ్ జస్టిస్ పాత్ర కూడా ఉందన్న బ్యూరోక్రాట్
- రిగ్గింగ్ కు బాధ్యత వహిస్తూ రాజీనామా
ఇస్లామాబాద్: పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, ఇందులో పాక్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తోపాటు చీఫ్ జస్టిస్ పాత్ర కూడా ఉందంటూ రావల్పిండి కమిషనర్ లియాఖత్ అలీ ఛత్తా సంచలన ఆరోపణలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రిగ్గింగ్ కు బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. తాను చేసిన నేరానికి శిక్షగా పబ్లిక్ గా ఉరితీయాలని అన్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయే అభ్యర్థులను గెలిపించారని ఆరోపించారు. తనతో పాటు రిగ్గింగ్ కు పాల్పడిన వారిని శిక్షించాలన్నారు.
బిడ్డ కోసం నవాజ్ షరీఫ్ త్యాగం
పాక్ మాజీ ప్రధాని, పీఎంఎల్ఎన్ నేత నవాజ్ షరీఫ్ తన బిడ్డ మర్యం నవాజ్ కోసం ప్రధాని పదవిని వదులుకున్నారు. ‘‘మర్యమ్ కు సీఎం పదవా? మీకు ప్రధాని పదవా? ఏదో ఒకటి తేల్చుకోవాలి” అంటూ ఆర్మీ కండిషన్ పెట్టడంతో.. ఆయన పీఎం పదవిని తన తమ్ముడు షెహబాజ్ షరీఫ్ కు ఇవ్వాలంటూ తప్పుకున్నారని స్థానిక మీడియా తెలిపింది.