అనంతపూర్ : టాప్ ఆర్డర్ ఫెయిలైనా.. మిడిలార్డర్ బ్యాటర్ శాశ్వత్ రావత్ (122 బ్యాటింగ్) సెంచరీతో చెలరేగడంతో.. దులీప్ ట్రోఫీలో ఇండియా–ఎ జట్టు తేరుకుంది. ఇండియా–సితో జరుగుతున్న మ్యాచ్‌లో గురువారం తొలి రోజు ఆట ముగిసే టైమ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 77 ఓవర్లలో 224/7 స్కోరు చేసింది. రావత్‌తో పాటు అవేశ్ ఖాన్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా–ఎ ఇన్నింగ్స్‌లో ప్రథమ్ సింగ్ (6), మయాంక్ అగర్వాల్ (6), తిలక్ వర్మ (5), రియాన్ పరాగ్ (2), కుమార్ కుశాగ్ర (0) నిరాశపర్చారు. ఈ దశలో రావత్, శామ్స్ ములానీ (44) ఆరో వికెట్‌కు 87 రన్స్ జోడించారు. తనుష్ కొటియాన్ (10) ఫెయిలయ్యాడు. అన్షుల్ కాంబోజ్ 3, విజయ్‌కుమార్ 2 వికెట్లు తీశారు.
ఇండియా-డి 306/5
ఇండియా-బితో జరుగుతున్న మరో మ్యాచ్‌లో ఇండియా-డి భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. సంజూ శాంసన్ (89 బ్యాటింగ్), దేవదుత్ పడిక్కల్ (50), శ్రీకర్ భరత్ (52), రికీ భుయ్ (56) హాఫ్ సెంచరీలతో రాణించడంతో.. తొలి రోజు ఆట ముగిసే టైమ్‌కు ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 77 ఓవర్లలో 306/5 స్కోరు చేసింది. శాంసన్‌తో పాటు సారాన్ష్ జైన్ (26 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. రాహుల్ చహర్ 3 వికెట్లు తీశాడు.