నానక్ రామ్ గూడలో డిసెంబర్ 23 న కారు ఆక్సిడెంట్ లో గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాప్ట్ వేర్ ఉద్యోగి వెంకట్ రామ్ రెడ్డి ఇవాళ (డిసెంబర్ 26)మృతి చెందాడు. ప్రమాదం రోజు మృతుడు వెంకటరామిరెడ్డి స్నేహితురాలు సాఫ్ట్ వేర్ శివాని స్పాట్ లోనే మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా కారు నడిపి ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల మృతికి కారణం అయిన నిందితుడు శ్రీ కలష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నానక్ రామ్ గూడ సర్వీస్ రోడ్డులో డిసెంబర్ 23న తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరిని వెనక నుండి వచ్చిన స్కోడా కారు ఢీ కొట్టింది. స్కోడా కారులో శ్రీ కలాశ్ తో పాటు మరో ఇద్దరు ప్రయానిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. నిందితుడు శ్రీ కలాశ్ హైదరాబాద్ కు చెందిన ప్రముఖ డాక్టర్ కుమారుడని తెలిపారు పోలీసులు. అదుపులోకి తీసుకున్న నిందితుడిని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా ప్రమాదం జరిగిన సమయంలో శ్రీకలాష్ మద్యపానం సేవించలేదని తెలిపారు రాయదుర్గం పోలీసులు....