టీచర్ రావడంలేదని ఎంఈవోకు ఫిర్యాదు

గుండాల, వెలుగు: ఆళ్లపల్లి మండలంలోని రాయపాడు స్కూల్లో విధులు నిర్వహిస్తున్న టీచర్ నిత్యం డుమ్మా కొడుతున్నాడని స్టూడెంట్స్​పేరెంట్స్ ఎంఈవోకు మంగళవారం కంప్లైంట్ చేశారు. స్పందించిన ఆయన స్కూల్​ను సందర్శించారు. ఎంఈవో వచ్చిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో స్కూల్ వద్దకు చేరుకున్నారు. 

సర్కారు స్కూల్ ని నమ్మి తమ పిల్లలను ప్రైవేట్ స్కూలుకు పంపించడం లేదన్నారు. కానీ ఇక్కడ పిల్లలకు ఏమి బోధించడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మధ్యాహ్న భోజనం పెట్టడం లేదని ఎంఈవోపై వారు ఫైరయ్యారు. ఇక్కడి స్కూల్ టీచర్ ని వేరే స్కూల్ కి బదిలీ చేసి, మరో టీచర్ ని రప్పిస్తా అని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు వెనక్కి తగ్గారు. టీచర్ పై డీఈవోకు కంప్లైంట్​చేస్తానని ఎంఈవో క్రిష్ణయ్య తెలిపారు.