సిరిసిల్ల టౌన్, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం రజాకార్ చిత్ర యూనిట్ సందడి చేసింది. సినిమా ప్రదర్శిస్తున్న విమల్ థియేటర్‌కు సినీనటి ఇంద్రజ, ఇతర నటీనటులు వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజాకర్ మూవీ చాలా అద్భుతంగా తీశామని, ఏ ఒక్క కులానికి, మతానికి, రాజకీయ పార్టీని ఉద్దేశించింది కాదన్నారు.
తెలంగాణ చరిత్రను నేటి యువత తెలుసుకోవడానికి ఈ సినిమా తీసినట్లు చెప్పారు. అనంతరం సిరిసిల్లలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి చిత్రయూనిట్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు రాజ్అర్జున్, బలగం సహదేవ్, గిరి, రమణ, శివం, డైరక్టర్ సత్యనారాయణ, థియేటర్ మేనేజర్ రవి పాల్గొన్నారు.