- బెస్ట్ డెబ్యూ డైరెక్టర్‌గా యాట సత్యనారాయణ ఎంపిక
- ఈ నెల 20 నుంచి గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్స్‌ఫెస్టివల్
న్యూఢిల్లీ, వెలుగు : రజాకార్ మూవీ డైరెక్టర్ యాట సత్యనారాయణకు అరుదైన గుర్తింపు దక్కింది. ఏటా గోవాలో నిర్వహించే ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్ఎఫ్ఐ)లో ఉత్తమ తొలి దర్శకుడు (బెస్ట్ డెబ్యూ డైరెక్టర్) కేటగిరీకి ఆయన నామినేట్ అయ్యారు. ఈ మేరకు సోమవారం కేంద్ర సమాచార, ప్రసార శాఖ వెల్లడించింది. దేశంలోని కొత్త, యువ ప్రతిభావంతులైన డైరెక్టర్లను ప్రోత్సహించే ఉద్దేశంతో ఐఎఫ్ఎఫ్ఐకి 5 చిత్రాలను ఎంపిక చేసినట్లు తెలిపింది.
దేశంలోని వివిధ భాషల్లో తెరకెక్కిన 117 సినిమాలు ఈ అవార్డు కోసం పోటీ పడ్డాయి. అందులో ఉత్తమ తొలి దర్శకుల కేటగిరీలో రజాకార్ (తెలుగు) దర్శకుడు యాట సత్యనారాయణతో పాటు బూంగ్(మణిపురి) దర్శకురాలు లక్ష్మీప్రియా దేవి, ఘరత్ గణపతి (మరాఠీ) దర్శకుడు నవజ్యోత్ బండివాడేకర్, మిక్కా బన్నాడ హక్కి (కన్నడ) దర్శకులు మనోహర, థానుప్(మలయాళం) డైరెక్టర్ రాగేశ్ నారాయణన్‌లను కమిటీ ఎంపిక చేసినట్లు వెల్లడించింది.