
తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో తెరకెక్కిన రజాకార్ (Razakar) మూవీ ఓటీటీకి వచ్చేసింది. 2024 మార్చి 15న థియేటర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ నేటి నుంచి( జనవరి 22) ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్కి అవుతుంది.
రజాకార్ ఓటీటీ:
జనవరి 22న ఆహా ఓటీటీ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి వివరాలు వెల్లడించింది. 'రజాకార్ల దురాగతాలను ఎదురించడానికి.. ప్రజలే సాయుధులై కదన రంగంలో దిగిన కథ , చరిత్ర పుటల్లో దాగిన ఈ నెత్తురు కథని ఆహాలో చూడండి' అంటూ ఆహా తెలిపింది.
ALOS READ | Pushpa 2 OTT: పుష్ప 2 ఓటీటీ అప్డేట్ .. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
అయితే, ఇక్కడ చిన్న కండిషన్ ఉంది. సాధారణ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లు కాకుండా ఆహాగోల్డ్ చేసుకున్న వాళ్ళే సినిమాను చూడొచ్చు. ఇక అందరికీ అందుబాటులో రావాలంటే జనవరి 24న చూడొచ్చు అని ఆహా తెలిపింది. దర్శకుడు యాట సత్యనారాయణ తెరకెక్కించిన ఈ సినిమాలో తమిళ నటుడు బాబీసింహా, హీరోయిన్ వేదిక, నటి అనసూయ, ఇంద్రజ, ప్రేమ ప్రధాన పాత్రల్లో నటించారు.
రజాకార్ల దురాగతాలను ఎదురించడానికి ప్రజలే సాయుధులై కదన రంగం లో దిగిన కథ , చరిత్ర పుటల్లో దాగిన ఈ నెత్తురు కథని #Aha లో చూడండి .
— ahavideoin (@ahavideoIN) January 22, 2025
Watch now only on ahaGold▶️https://t.co/YgoknoXi9p #Razakar @anusuyakhasba @actorsimha @actorjohnvijay @therajarj @Vedhika4u #Hyderabad pic.twitter.com/gfcH32ZvmR
రజాకార్ కథ:
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ ను ఇండియాలో కలపడానికి ఒప్పుకోడు నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఆయన అండచూసుకొని రజాకార్ చీఫ్ ఖాసీం రిజ్వీ హైదరాబాద్‌ను తుర్కిస్థాన్‌గా మార్చడానికి ప్రయత్నాలు చేస్తాడు. అందుకోసం మతమార్పిడులకు పాల్పడతాడు. ఉర్దూ రానివారిని కఠినమైన శిక్షలు వేస్తాడు. అలాంటి వారి ఆకృత్యాలను కొంతమంది పోరాటయోధులు ఎలా ఎదుర్కొన్నారు అనేది రజాకార్ సినిమా కథ.