రాజకార్ మూవీతో.. ఓటు బ్యాంకు పాలిటిక్స్‌ పతనం: బండి సంజయ్

రాజకార్ మూవీతో.. ఓటు బ్యాంకు పాలిటిక్స్‌ పతనం: బండి సంజయ్

రాజకార్ అనే ఒక విప్లవ పదం వెనుక తెలంగాణ సాయుధ పోరాట గాథలెన్నో కనిపిస్తాయి. ఇక కనిపించని మరెన్నో వెతలను, సామాన్యులు అనుభవించిన వేదనలను చూపించడానికి వస్తున్న మూవీ రజాకార్‌(Razakar) . ఇప్పుడు తెలంగాణ చరిత్రను తెలుసుకోవడం చాలా అవసరం అంటూ రైటర్.. డైరెక్టర్ యాట సత్య నారాయణ రజాకార్‌ మూవీను తెరకెక్కిస్తున్నారు. 

తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో..పాతిన తుపాకీ చివర అంచున ఒక రజాకారుడి మరణం.. పాఠాలు బోధించే మాస్టారు రోదన .హైద్రాబాద్  మారణ హోమం.. చుట్టూ పోలీసులు..కాళ్ళను పట్టుకుని ప్రాధేయపడే అమాయకపు జనాలు..ఇలా ఆసక్తి పెంచుతోంది పోస్టర్. ప్రస్తుతం ప్రతి తెలంగాణ బిడ్డ మన తెలంగాణ మూలాలు, అనుభవించిన దురవస్థలు తెలుసుకోవడం ఈ సినిమా నేపధ్యం అని డైరెక్టర్ తెలిపారు. 

ఈ మూవీ పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ మాట్లాడుతూ '18–40 సంవత్సరాల మధ్యవయసు వారికి తెలంగాణ చరిత్ర తెలియదని, ఈ సినిమా ద్వారా ప్రతి ఒక్కరికి తెలంగాణ చరిత్ర తెలుస్తుందన్నారు. కొందరు చరిత్రను తెరమరుగు చేయాలని చూస్తూ, ఓటు బ్యాంకు పాలిటిక్స్‌ చేస్తున్నారన్నారు. 

ఈ సినిమా రిలీజ్‌ అయితే కొందరి మైండ్‌ బ్లాక్‌ అవుతుందన్నారు. సోషల్‌ మీడియా వారియర్స్‌, యువత మీడియా ద్వారా రజాకార్‌ సినిమాపై ప్రచారం చేయాలన్నారు. అలాగే మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావ్ మాట్లాడుతూ  'సెప్టెంబర్‌ 17ను విమోచన దినోత్సవంగా ప్రభుత్వమే నిర్వహించాలని పేర్కొన్నారు. 

ఈ మూవీ కార్యక్రమంలో సుద్దాల అశోక్‌ తేజ, జితేందర్‌ రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, సంగప్ప, విఠల్‌తో పాటు నటుడు బాబి, అనిష్కా త్రిపాఠి, లక్ష్మణ్‌తో పాటు చిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. త్వరలో ఈ మూవీ నుంచి మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.