Aha OTT: ఓటీటీలోకి లేటెస్ట్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Aha OTT: ఓటీటీలోకి లేటెస్ట్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో తెరకెక్కిన రజాకార్‌ (Razakar) మూవీ ఓటీటీకి వచ్చేస్తోంది. 2024 మార్చి 15న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఓటీటీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

రజాకార్‌ ఓటీటీ:

మంగళవారం జనవరి 7న తెలుగు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహావీడియో(Ahavideo) ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. "ధైర్యం, చరిత్ర, ఎవరూ చెప్పని స్టోరీ.. రజాకార్ జనవరి 24న ఆహా వీడియోలో  స్ట్రీమింగ్ కానుందంటూ" కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ద‌ర్శ‌కుడు యాట స‌త్య‌నారాయ‌ణ తెరకెక్కించిన ఈ సినిమాలో తమిళ నటుడు బాబీసింహా, హీరోయిన్ వేదిక‌, నటి అన‌సూయ, ఇంద్రజ, ప్రేమ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించారు. 

వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలనాటి పరిస్థితులను, అప్పుడు జరిగిన హింసాకాండను కళ్లకు కట్టినట్టుగా చూపించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రేక్షకులు సైతం ఈ సినిమాను బాగానే ఆదరించారు. ఇందులో ముఖ్యంగా షోయాబుల్లాఖాన్‌, చాక‌లి ఐల‌మ్మ‌, రాజారెడ్డి తో పాటు చాలా మంది నాయ‌కుల పోరాటప‌ఠిమ‌ను స్ఫూర్తిదాయ‌కంగా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేశారు డైరెక్టర్. ఇకపోతే రిలీజైన 10 నెలల తర్వాత ఓటీటీకి వస్తుండటంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ALSO READ : Pushpa 2: పుష్ప 2 జపాన్ సీక్వెన్స్‌తో 20 నిమిషాల రీలోడ్ వెర్షన్.. థియేటర్లలో ఎప్పటి నుంచంటే?

రజాకార్ సినిమా కథ:

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ ను ఇండియాలో కలపడానికి ఒప్పుకోడు నిజాం ప్ర‌భువు మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఆయన అండచూసుకొని ర‌జాకార్ చీఫ్ ఖాసీం రిజ్వీ హైద‌రాబాద్‌ను తుర్కిస్థాన్‌గా మార్చడానికి ప్ర‌య‌త్నాలు చేస్తాడు. అందుకోసం మ‌త‌మార్పిడుల‌కు పాల్పడతాడు. ఉర్దూ రానివారిని కఠినమైన శిక్షలు వేస్తాడు. అలాంటి వారి ఆకృత్యాలను కొంతమంది పోరాటయోధులు ఎలా ఎదుర్కొన్నారు అనేది రజాకార్ సినిమా కథ.